Shraddha Walker Case: శ్రద్ధా తల ఎక్కడ? ఆమె ఫోన్ ఎక్కడ? తలలు పట్టుకుంటున్న పోలీసులు!

Shraddha Walker Murder Update: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావల్లాను పోలీసులు 14 రోజుల పాటు విచారించినా అసలు విషయాలు మాత్రం రాబట్ట లేదని అంటున్నారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 3, 2022, 10:03 AM IST
Shraddha Walker Case: శ్రద్ధా తల ఎక్కడ? ఆమె ఫోన్ ఎక్కడ? తలలు పట్టుకుంటున్న పోలీసులు!

Shraddha Walker Murder Case Update: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావల్లాను పోలీసులు 14 రోజుల పాటు విచారించారన్న సంగతి తెలిసిందే. అయితే ఇంత జరిగినా పోలీసులు వెతుకుతున్న సమాధానాలు, ఆధారాలు ఇంకా దొరకలేదు. దీంతో అఫ్తాబ్‌కు నార్కో టెస్టు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబరు 1న అఫ్తాబ్ తొలిసారిగా శ్రద్ధా హత్యకు సంబంధించిన ప్రశ్నలపై రెండు గంటలపాటు మాట్లాడాడు. అయితే అతని సమాధానం విని దర్యాప్తు అధికారులు  ఆశ్చర్యపోయారు. అఫ్తాబ్‌ను ఒప్పించి, అతని అంగీకారం తీసుకున్న పది నిమిషాల తర్వాత, అతనికి అనస్థీషియా మరియు ఇతర అవసరమైన మందులు ఇచ్చారు.

ఈ నార్కో టెస్టు ద్వారా పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు శ్రద్ధ హత్యకు కుట్ర పన్నినప్పటి నుంచి ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి పారేయడం వరకు మొత్తం క్రమాన్ని అర్థం చేసుకోవాలనుకున్నారు, అయితే ఈ ప్రశ్నలకు కేంద్రంగా శ్రద్ధా కత్తిరించిన తల, ఆమె మొబైల్ ఫోన్, హత్య సమయంలో శ్రద్ధ ధరించిన బట్టలు ఎక్కడ ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేశారు. పరీక్ష సమయంలో అఫ్తాబ్‌ను చాలా ప్రశ్నలు అడిగారు.

అయితే వీటిలో ముఖ్యమైనవి అసలు శ్రద్ధ ఏ తేదీన హత్య చేయబడింది? శ్రద్ధను ఎందుకు చంపారు? శ్రద్ధను ఎలా చంపారు? శవాన్ని ముక్కలుగా ఎలా నరికారు? - స్లైసింగ్ చేసే కత్తులు ఎక్కడ కొనుగోలు చేశారు? ఇంట్లో ముక్కలను ఎంతకాలం ఉంచారు? ముక్కలు ఎలా మరియు ఎక్కడ ఉంచారు? ఆయుధాలను ఎక్కడ విసిరారు? హత్య జరిగిన ఆరు నెలల పాటు ఏం చేశారు? కోపంతో, పొరపాటున హత్య జరిగితే, పోలీసులకు ఎందుకు లొంగిపోలేదు? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ అడిగిన ప్రతి ప్రశ్నకు అఫ్తాబ్ తీరికగా సమాధానమిచ్చాడని, చాలా ప్రశ్నలకు ఆంగ్లంలోనే సమాధానాలు చెప్పాడని అంటున్నారు.

అఫ్తాబ్ మొదట చాలా ప్రశ్నలు అడిగిన సమయంలో మౌనంగా ఉన్నాడని, కానీ మళ్లీ అవే ప్రశ్నలు అడగడంతో అతను స్పందించాడని అంటున్నారు. అయితే, అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ నిర్వహించిన ఫోరెన్సిక్ టీమ్ వర్గాలు ఈ పరీక్షకు సంబంధించి ముఖ్యమైన విషయాలు వెల్లడించాయి. నార్కో టెస్టులో అఫ్తాబ్ కొత్తగా ఏమీ చెప్పలేదని అంటున్నారు. మొన్నటి వరకు పోలీసులతో మాట్లాడిన మాటలే మళ్లీ చెప్పాడని అంటున్నారు.  దీంతో ఈ కేసు ఛేదించేందుకు పోలీసులు మరింత కష్టపడాల్సి వస్తోందని ఈ టెస్టు ద్వారా అఫ్తాబ్ నుంచి కొత్త క్లూ దొరకలేదని అంటున్నారు.

అయితే కోర్టు వెలుపల అఫ్తాబ్ ఏమి ఒప్పుకున్నా దానికి ప్రాముఖ్యత లేదని అంటున్నారు, అఫ్తాబ్ నార్కో విశ్లేషణ పరీక్షను నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్న దాన్ని కనుక పరిశీలిస్తే ఈ కేసుకు సంబంధించి మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను పోలీసులు ఇప్పటివరకు రికవరీ చేయలేకపోయారు. ఇందులో శ్రద్ధా నరికిన తల, ఆ రంపపు... అఫ్తాబ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, శ్రద్ధా మొబైల్ ఫోన్ లాంటివి ఉన్నాయి. 
 Also Read: Eesha Rebba Hot Photos: మరోమారు రెచ్చిపోయిన ఈషా రెబ్బ.. చొక్కా విప్పేసి మరీ రచ్చ చేస్తోందిగా!

Also Read: HIT 2 Main Villain : HIT 2 విలన్.. నెట్టింట్లో దారుణమైన ట్రోల్స్.. పరువుతీస్తోన్న నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News