Territorial Army jawan arrested for Cheating: కొన్ని విషయాలు వింటే మోసపోయిన వారి బాధ కంటే మోసం చేసిన వారి తెలివితేటలు అబ్బురపరుస్తూ ఉంటాయి. తాజాగా ఆర్మీలో చేర్పిస్తామంటూ ఓ టెరిటోరియల్ ఆర్మీ జవాను తన సహచరులతో కలిసి ఇద్దరు అమాయకుల వద్ద 16 లక్షలు కాజేశాడు. నిందితుడు రాహుల్ పఠాన్‌కోట్‌లో ఉంటూ ఇద్దరు అన్నదమ్ములకు నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, యూనిఫాంలు ఇప్పించి INSAS రైఫిల్స్‌తో డ్యూటీ కూడా చేయించారు. ఇద్దరికీ ప్రతినెలా 12-12 వేల రూపాయల జీతం కూడా జేబులోంచి చెల్లిస్తూనే ఉన్నాడట. ఈ విషయాన్ని మోసపోయిన యువకులు వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని తన ఇంటికి చేరుకున్న బాధితుడు మనోజ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడయిన జవాన్ సహా ఇద్దరిని మీరట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కంక్రలా గ్రామంలోని నిందితుడైన జవాన్ రాహుల్, అతని సహచరుడు బిట్టును పోలీసులు అలాగే మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు విచారిస్తున్నాయి. ఇక వీరిద్దరి నుంచి ఒక 32 బోర్ పిస్టల్, 2 32 బోర్ మ్యాగజైన్‌లు, కెప్టెన్ ర్యాంక్ సూచించే రెండు బ్యాడ్జ్‌లు, 2 రబ్బరు స్టాంపులు, 2 రబ్బర్ స్టాంప్ హ్యాండిల్స్, మూడు నేమ్ ప్లేట్లు, రెండు ఆర్మీ షోల్డర్ (TA) బ్యాడ్జ్‌లు, ఒక లాన్యార్డ్ (AMC-ఆర్మీ మెడికల్ కార్ప్స్), లాన్యార్డ్ (ఆర్మీ సప్లై కార్ప్స్), ఒక గ్రీన్ బెల్ట్, ఒక ఆర్మీ ఆఫీసర్ క్యాప్, ఒక మొబైల్, ఒక మిలిటరీ అధికారి పూర్తి యూనిఫాం, మూడు పతకాలు (OP రక్షక్, J&K, నో సాలా) స్వాధీనం చేసుకున్నారు.
ఇక పఠాన్‌కోట్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈ అంశంపై విచారణ జరుపి నివేదికను రక్షణ మంత్రిత్వ శాఖకు పంపారు. నిజానికి నిందితుడిని 2020లో పఠాన్‌కోట్‌లో నియమించారు. సైనిక వర్గాల సమాచారం ప్రకారం, 2019లో బాధితుడు మనోజ్ అయోధ్యలో సైనిక రిక్రూట్‌మెంట్ సమయంలో నిందితుడి అనుచరుడు బిట్టును కలిశాడు. 2020లో, రాహుల్ని ఉద్యోగం మనోజ్ ఇప్పించమని కోరాడు, అప్పుడు రాహుల్ యూనిఫాం ధరించి వీడియో కాల్ చేశాడు. నమ్మకం కుదిరిన తరువాత మనోజ్ అతని సోదరుడు భీంసేన్ నుంచి ఒక్కొక్కరి నుంచి ఎనిమిది లక్షల రూపాయలను వసూలు చేశాడు రాహుల్. ఆ తరువాత నిందితులు అన్నదమ్ములిద్దరికీ ఆర్మీ దుస్తులు, ఆయుధాలు, నకిలీ ఐడీ కార్డులు అందించారు.
అంతేకాక 2020లో నకిలీ నియామకాలు చేసి పఠాన్‌కోట్‌లో శిక్షణ ఇచ్చాడు. ఆ సమయంలో నిందితుడు రాహుల్‌కి పోస్టింగ్ పఠాన్‌కోట్‌లో ఉందట. ఇక వారికి అనుమానం రాకుండా ప్రతినెలా రూ.12వేలు జీతం ఖాతాలో జమ చేసేవాడని వారు చెబుతున్నారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఓ ఆర్మీ జవాను తన గుర్తింపు కార్డు నకిలీదని చెప్పడంతో మనోజ్ ఆర్మీ ఇంటెలిజెన్స్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుడు మనోజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్ దర్యాప్తు అనంతరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
టెరిటోరియల్ ఆర్మీలో ఆరు నెలలు ఉద్యోగం, ఆరు నెలలు జీతం లేకుండా ఇంట్లోనే ఉండాలనే నిబంధన ఉంది. ఈ కారణంగా, రాహుల్ ఆ ఖాళీగా ఉన్న ఆరు నెలల పాటు ఆర్మీ ఆఫీసర్ల యూనిఫాం ధరించి బిట్టుతో పాటు నిరుద్యోగ యువకుల కోసం వెతికేవాడు. ఆర్మీలో చేరేందుకు ఇష్టపడే వారిని ఉద్యోగాల పేరుతో మోసం చేసేవాడని పోలీసులు తేల్చారు. ఈ సమయంలో, నిందితులు ఆర్మీ కెప్టెన్, కొన్నిసార్లు మేజర్ యూనిఫాం ధరించేవారని గుర్తించారు. నిందితుడు రాహుల్ నెట్‌వర్క్ ఎంత వరకు విస్తరించిందనే దానిపై పోలీసులు, సైన్యానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు విచారణ చేస్తున్నాయి.
Also Read: PM Narendra Modi: నరేంద్ర మోదీ గురువు కన్నుమూత.. ట్విట్టర్‌లో ప్రధాని ఎమోషనల్
Also Read: Gujarat Elections 2022: సహోద్యోగులపై జవాన్ కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook