Mahakaleshwar Temple: ప్రముఖ ఆలయంలో అమ్మాయిల రచ్చ రచ్చ.. 'రీల్స్‌' వద్దన్న సెక్యూరిటీపై దాడి

Ujjain Reels Clash In Ujjain Mahakaleshwar Temple: ఇప్పుడు అందరూ రీల్స్‌ పట్టుకుని వేలాడుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ రీల్స్‌ చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. వాళ్ల పిచ్చి ఆలయాల్లో కూడా కొనసాగుతోంది. దీంతో ఓ ప్రముఖ ఆలయంలో ఇలాగే రీల్స్‌ చేస్తుండగా అక్కడి అధికారులు అభ్యంతరం చెప్పడంతో లొల్లి లొల్లయ్యింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 7, 2024, 07:58 PM IST
Mahakaleshwar Temple: ప్రముఖ ఆలయంలో అమ్మాయిల రచ్చ రచ్చ.. 'రీల్స్‌' వద్దన్న సెక్యూరిటీపై దాడి

Mahakaleshwar Temple: ఆలయం అంటే పరమపవిత్రమైనది. నిండు మనసుతో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆలయానికి వెళ్లాలి. సంప్రదాయ వస్త్రధారణ వేసుకుని వెళ్తే మరి మంచిది. అలాంటిది ఆలయాల్లో ఫోన్లు తీసుకెళ్తూ భక్తులు ఆలయంలో హల్‌చల్‌ చేస్తున్నారు. ఇది ఇతర భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నా వారు పట్టించుకోకుండా వ్యవహారిస్తున్నారు. అలాగే ప్రసిద్ధి జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఆలయ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయగా వారితో గొడవకు దిగారు. దీంతో ఆలయంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. దురుసుగా ప్రవర్తించిన భక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Klin Kaara: గుండు చేయించుకున్న రామ్‌చరణ్‌ కుమార్తె క్లీంకార.. ఎందుకంటే?

మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయం. శనివారం పాలక్‌, పారి అనే ఇద్దరు యువతులు శనివారం దర్శనానికి వచ్చారు. ఆలయంలో ఫోన్లు నిషేధం ఉంది. కానీ వారిద్దరూ అలాగే ఫోన్లు లోపలికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆలయంలో ఫొటోలు, వీడియోలు, రీల్స్‌ చేస్తూ ఆలయ సిబ్బందికి చిక్కారు. నిషేధిత ప్రాంతంలో రీల్స్‌ చేస్తుండడాన్ని ఆలయ అధికారులు తప్పుబట్టారు. అడ్డుకున్న సిబ్బందిపై ఆ ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. వారితోపాటు మరికొందరు కూడా ఆలయ అధికారులపై దాడి చేయడం కలకలం రేపింది.

Also Read: Nikhil Siddhartha Twist: హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ బిగ్‌ ట్విస్ట్.. టీడీపీలో చేరలేదంటూ ప్రకటన

దాడి అనంతరం ఆ ఇద్దరు యువతులు పరారయ్యారు. దాడి సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని గాలిస్తున్నారు. ఆలయంలో పని చేస్తున్న మహిళా గార్డులు శివానీ పుష్పాడ్‌, సంధ్య ప్రజాపతి, సంగీత చంగేసియాలు గాయపడ్డారు. ఓ ప్రైవేటు సంస్థ ద్వారా వాళ్లు విధులు నిర్వహిస్తున్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితులను వెతుకుతున్నామని అక్కడి పోలీస్‌ అధికారి అజయ్‌ వర్మ తెలిపారు. ఇద్దరు యువతులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆలయంలో యువతులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆలయంలోకి ఫోన్లు తీసుకెళ్లడమే తప్పు.. ఇంకా రీల్స్‌ కూడానా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. యువతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏ గర్భగుడిలోనైనా దేవతామూర్తుల దివ్యరూపం బయటకు కనిపించరాదు. అది హిందూ మతాచారం. కానీ కొందరు అత్యుత్సాహంతో గర్భగుడిలోని మూలవిరాట్టును ఫోన్‌లలో నిక్షిప్తం చేయడం సరికాదని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News