Woman Murdered Husband: భర్తను మంచానికి కట్టేసి 5 ముక్కలుగా నరికిన భార్య.. దారుణ ఘటన

Woman Cuts Husband Body Into Pieces: యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్తను మంచానికి కట్టేసి.. దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని 5 ముక్కలుగా కట్ చేసి.. దగ్గరలోని కెనాల్‌లో పాడేసింది. వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2023, 04:30 PM IST
Woman Murdered Husband: భర్తను మంచానికి కట్టేసి 5 ముక్కలుగా నరికిన భార్య.. దారుణ ఘటన

Woman Cuts Husband Body Into Pieces: కట్టుకున్న భర్తను మంచానికి కట్టేసి.. 5 ముక్కలుగా నరికి హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. తన తండ్రి కనిపించడం లేదంటూ కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడి భార్యపై అనుమానంతో పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు చెప్పింది. పూర్తి వివరాలు ఇలా.. ఉత్తర ప్రదేశ్‌లోని గాజురాలలోని శివనగర్‌కు చెందిన రామ్‌పాల్‌ (55), దులారో దేవి భార్యాభర్తలు. వీరికి కొడుకు సన్ పాల్ ఉన్నాడు.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన సన్‌పాల్‌.. తిరిగి ఇంటికి వచ్చే సరికి తండ్రి కనిపించలేదు. తండ్రి గురించి తల్లిని అడగ్గా.. కనిపించడం లేదని చెప్పింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దులారో దేవి ప్రవర్తనపై అనుమానంతో అదుపులోకి తీసుకుని గట్టిగా అడిగారు. దీంతో తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. హత్య ఎలా చేసిందో పోలీసులకు వివరించింది.

తన భర్తను మంచానికి కట్టేసి ఐదు ముక్కలుగా నరికినట్లు చెప్పింది. గత ఆదివారం రాత్రి రాంపాల్‌ను హత్య చేసి.. ముక్కలను కాలువలో పడేసినట్లు తెలిపింది. పోలీసులు ఈతగాళ్ల సాయంతో రాంపాల్ శరీర భాగాలను కాలువ నుంచి వెలికితీశారు. మృతుడి రక్తంతో తడిసిన దుస్తులు కూడా లభించాయి. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నేరానికి గల కారణాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: BRO Twitter Review: బ్రో ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే.. పవన్ స్టామినాకు తగ్గట్లే..!  

Also Read: Pune Woman Rape Case: అప్పు చెల్లించలేదని దారుణం.. భర్త ఎదురుగానే భార్యపై అఘాయిత్యం   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x