OTT Movies: మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్... ఈ నెలలో ఓటీటీ వేదికగా మూడు బడా చిత్రాలు రిలీజ్..!

OTT Movies: కరోనా నేపథ్యంలో...మూవీ లవర్స్ ఎక్కువగా ఓటీటీకి అలవాటుపడ్డారు. గత ఏడాది థియేటర్లలో విడుదలైన మూడు భారీ చిత్రాలు జనవరిలోనే ఓటీటీ వేదికగా రానున్నట్లు సమాచారం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 07:03 PM IST
OTT Movies: మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్... ఈ నెలలో ఓటీటీ వేదికగా మూడు బడా చిత్రాలు రిలీజ్..!

OTT Movies: మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. ఈ నెలలో ఓటీటీ వేదికగా మూడు బడా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో అల్లు అర్జున్ పుష్ప, బాలకృష్ణ అఖండ, శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ పెళ్లిసందడి. ఈ మూడు చిత్రాలు సంక్రాంతికి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'పుష్ప' (Pushpa Movie). సుకుమార్ దర్శకుడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకొంది. ఇక ఈ సినిమా డిజిటల్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నట్లు సమాచారం. 

Also Read: Pushpa Movie Collection: బాలీవుడ్ లో పుష్పరాజ్ జోరు.. బాక్సాఫీసు ముందు కలెక్షన్ల వర్షం!

కరోనా పరిస్థితులలోనూ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది బాలకృష్ణ 'అఖండ'. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన ఈ చిత్రం హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. అఖండ (Akhanda Movie) హాట్‌స్టార్‌ ఓటీటీలో ఇదే నెలలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో విడుదలకానున్న మరో చిత్రం 'పెళ్లి సందడి' (Pelli SandaD). శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా (Hero Roshan) తెరకెక్కింది. హాట్‌స్టార్‌ (Hotstar Ott) వేదికగా ఈ సినిమా జనవరి 14న విడుదల చేస్తున్నట్లు సమాచారం. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News