Aakasam lo Oka Tara: తెలుగులో దుల్కర్ సల్మాన్ దూకుడు.. తాజాగా గీతా ఆర్ట్స్ల్ లో మరో భారీ చిత్రంతో రానున్న మలయాళీ స్టార్..

Dulqer Salmaan - Aakasam lo Oka Tara: మలయాళ సూపర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్..తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మమ్ముట్టి కుమారుడిగా సినిమా రంగంలోకి ప్రవేశించిన దుల్కర్ సల్మాన్.. ఆ తర్వాత వరుస సినిమాలతో దుమ్ము దులుపుతున్నాడు. తాజాగా మరో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 28, 2024, 02:25 PM IST
Aakasam lo Oka Tara: తెలుగులో దుల్కర్ సల్మాన్ దూకుడు..  తాజాగా గీతా ఆర్ట్స్ల్ లో మరో భారీ చిత్రంతో రానున్న మలయాళీ స్టార్..

Dulqer Salmaan - Aakasam lo Oka Tara: దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.  తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘సీతారామం’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీలో ప్రభాస్ ను పెంచి పెద్ద చేసే గురువు పాత్రలో నటించి మెప్పించాడు. ఓ రకంగా పరశురాముడి పాత్ర అని చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘లక్కీ భాస్కర్’ మూవీతో పలకరించబోతున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈయన పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అంటూ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘ఆకాశంలో ఒక తార’గా తెరకెక్కబోతున్న ఈ మూవీ పోస్ట‌ర్‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ లుక్  సింపుల్‌గా క్యూట్ గా  ఉంది. ఇందులో రైతు పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అదే పోస్ట‌ర్‌లో ఓ అమ్మాయి స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్లాడాన్ని చూడొచ్చు. దుల్క‌ర్ మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్టర్ లో అలరించబోతున్నట్టు తెలుస్తుంది.  ఈ సినిమాతో ప్రేక్షకుల్లో  ఓ క్యూరియాసిటీ పెంచాడు. హృద‌యాన్ని హ‌త్తుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రాబోతుంది.

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ‌లైన గీతా ఆర్ట్స్‌, స్వ‌ప్న సినిమాల‌తో పాటు లైట్ బాక్స్ మీడియా బ్యాన‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సందీప్ గుణ్ణం, ర‌మ్య గుణ్ణం ఈ మూవీని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ‌లు అశ్వనీదత్, అల్లు అరవింద్ సంస్థలు  ఈ మూవీ నిర్మాణంలో భాగ‌మ‌వుతుండ‌టం అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచుతోంది.

త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక  ఈ సినిమాలోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేయనున్నారు. అభిమానులు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ కోసం ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, మలయాళంతో పాటు కన్నడ, హిందీ, తమిళంలో ఈ సినిమా రాబోతుంది. త్వరలో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ పేరుతో రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News