Dulkar Salman: దుల్కర్ సల్మాన్ ప్రైవేట్ పార్ట్స్ తాకిన ఆ మహిళ ఎవరు, రాణా ఏమంటున్నాడు

Dulkar Salman: సినీ రంగంలో ఎప్పుడూ మహిళలను టార్గెట్ చేసే పరిణామాలే చూస్తుంటాం. తమ ప్రైవేట్ పార్ట్స్‌ను టచ్ చేశారనే ఆరోపణలు తరచూ వింటుంటాం. కానీ ఇప్పుడీ ఆరోపణలు ఓ హీరో నుంచి వినడం సంచలనంగా మారింది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 20, 2023, 03:09 PM IST
Dulkar Salman: దుల్కర్ సల్మాన్ ప్రైవేట్ పార్ట్స్ తాకిన ఆ మహిళ ఎవరు, రాణా ఏమంటున్నాడు

Dulkar Salman: ప్రైవేట్ పార్ట్స్‌పై అసభ్యకరంగా తాకుతూ మహిళల్ని లైంగికంగా వేధించే ఘటనలు చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. అలాంటిదే ఓ ఘటన ఈసారి ఓ హీరోకు ఎదురైంది. ఆశ్చర్యంగా ఉందా..అవును నిజమే ఇది. అప్‌కమింగ్ హీరో దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ మహిళ తన ప్రైవేట్ పార్ట్‌ను అసభ్యకరంగా తాకిందని మీడియా సాక్షిగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది.

మహానటి సినిమాతో పరిచయమై సీతారామంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటుడు దుల్కర్ సల్మాన్. చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు సాదించాడు. తాజాగా కింగ్ ఆఫ్ కోథా, గన్ అండ్ గులాబ్స్‌లో నటించాడు. కింగ్ ఆఫ్ కోథా సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సల్మాన్ దుల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ మహిళపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాలంటే చాలా మంది ఇష్టపడతారని ఇందులో భాగంగా చాలామంది అభిమానులు వచ్చి కలుస్తుంటారని సల్మాన్ దుల్కర్ చెప్పాడు. తాను కూడా ఎంత బిజీగా ఉన్నా అభిమానుల్ని కలవడం, చాట్ చేయడం చేస్తుంటానన్నాడు.  కొంతమంది సెల్ఫీ అంటూ దగ్గరికొచ్చి ముద్దు పెట్టేస్తుంటారన్నాడు. 

అటువంటి సందర్భంలో ఓ మహిళ తన ప్రైవేట్ పార్ట్‌ను అసభ్యకరంగా తాకిందని..ఈ ఘటన తనకు చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సల్మాన్ దుల్కర్‌ను తాకిన ఆ అమ్మాయి ఎవరని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ పార్ట్స్ తాకిన అమ్మాయి సెలెబ్రిటీనా లేదా సాధారణ అమ్మాయా అని అడుగుతున్నారు. ఇంకొంతమందైతే పొరపాటున తగిలిందేమో అంటున్నారు. 

మరోవైపు ఈ విషయంపై నటుడు రాణా కూడా స్పందించాడు. దుల్కర్ సల్మాన్.వ్యాఖ్యల్ని తాను పట్టించుకోనని..అవి అతని వ్యక్తిగత విషయాలని చెప్పాడు. కింగ్ ఆఫ్ కోథాలో దుల్కర్ సల్మాన్ సరసన ప్రసన్న నటిస్తోంది. ఈ సినిమాను జీ స్డూడియోతో కలిసి సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

Also read: Ketika Sharma: పొట్టి నిక్కర్‌లో బ్రో బ్యూటీ సందడి.. కేతిక శర్మ ఖతర్నాక్ పోజులు చూశారా..!

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News