Sitara: వైరల్ గా మారిన 'సితార' సరికొత్త వీడియో..గోవా డైరీస్ అంటూ వచ్చేసిన 'ఏ అండ్ ఎస్'..

Sitara: సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సితార.. వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి యూట్యూబ్ ఛానెల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల గోవా హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్‌ చేసిన ఈ లిటిల్ రాక్ స్టార్స్...తమదైన శైలిలో ఒక వీడియోను తీసుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2021, 04:24 PM IST
Sitara:  వైరల్ గా మారిన 'సితార' సరికొత్త వీడియో..గోవా డైరీస్ అంటూ వచ్చేసిన 'ఏ అండ్ ఎస్'..

Sitara: తన ముద్దు ముద్దు మాటలతో..అల్లరి చేష్టలతో ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కూతురు సితార. ఈ చిన్నారి సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్ గా ఉంటూ..తన బ్యూటిపుల్ పోటోస్, వీడియోలు షేర్ చేస్తూంటుంది. తను ఏ పోస్టు పెట్టిన నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇటీవల 9వ బర్త్ డే జరుపుకున్న సితార ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

సితార(Sitara) సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. తన ప్రాణ స్నేహితురాలు.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుమార్తెతో కలిసి 'ఏ అండ్ ఎస్' అనే పేరుతో యూట్యూబ్ ఛానల్(You tube Channel) రన్ చేస్తోంది సితార. అందులో పిల్లలను ఎంటర్‏టైన్ చేసే ఫన్నీ వీడియోలు, గేమ్స్, టాస్క్‏లు, ఛాలెంజెస్ వంటివి అప్‏లోడ్ చేస్తుంటారు. వీరి ఛానల్‏కు లక్షకు పైగా సబ్‏స్క్రైబర్స్ ఉన్నారు. ఛానల్లో వీరిద్దరు కలసి గతంలో హీరోహీరోయిన్లకు సైతం ఇంటర్వ్యూ చేశారు. అందులో మహేష్ బాబు, రష్మిక మందన్నాను కూడా ఇంటర్వ్యూ చేశారు ఈ సూపర్ కిడ్స్.

Also Read: Penalty for Actress: ట్యాక్స్ ఎగ్గొట్టిందని..టీవీ నటికి రూ.330కోట్ల ఫైన్! ఎక్కడో తెలుసా?

తాజాగా వీరిద్దరు కలిసి గోవా డైరీస్(Goa Diaries) అంటూ కెమెరా ముందుకు వచ్చారు. ట్రావెల్ టేల్స్(Travel Tales) పేరుతో గోవా టూర్‏కు సంబంధించిన విషయాలను చెబుతున్న వీడియోను షేర్ చేశారు ఈ కిడ్స్. ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట(sarkaru vari paata) షూటింగ్ కోసం గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్‏తోపాటు ఆయన కుటుంబం మొత్తం గోవా వెళ్లారు. వీరితోపాటు… డైరెక్టర్ వంశీ పైడిపల్లి(Director Vamsi pidepalli) కుటుంబం కూడా గోవా వెళ్లారు. అక్కడ గడిపిన క్షణాలను సితార, ఆద్య(Adya) ఇద్దరూ గోవా డైరీస్ రూపంలో తమ యూట్యూబ్ ఛానల్‏లో షేర్ చేశారు. రెస్టారెంట్ కి వెళ్లి బ్రెడ్ తీసుకొచ్చి బాతులకు పెట్టడం దగ్గర నుంచి.. బీచ్ కు వెళ్లి ఎంజాయ్ చేసే వరకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీడియోను మహేష్ తన ట్విట్టర్(Twiiter) ఖాతాలో షేర్ చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News