Christmas tree tattoo: వి సినిమాతో పోయిన క్రేజ్..ఆ టాటూతో వచ్చేసిందట

Christmas tree tattoo: వేరే ఎక్కడైనా కన్పిస్తుందో లేదో గానీ..కులమతాలతో సంబంధం లేకుండా అన్ని పండుగల్ని కచ్చితంగా సెలెబ్రేట్ చేసేది సినీ ప్రముఖులే. అందుకే ఆ హీరో వేయించుకున్న పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ ఫోటో విశేషమేంటో తెలుసుకుందాం..

Last Updated : Dec 25, 2020, 08:51 PM IST
  • వీపుపై క్రిస్మస్ ట్రీ టాటూ వేయించుకున్న సుధీర్ బాబు
  • సిక్స్ ప్యాక్ ఫోజిస్తూనే..టాటూ ఫోటోతో విషెస్ చెబుతున్న హీరో
  • వైరల్ గా మారిన ఫోటో
Christmas tree tattoo:  వి సినిమాతో పోయిన క్రేజ్..ఆ టాటూతో వచ్చేసిందట

Christmas tree tattoo: వేరే ఎక్కడైనా కన్పిస్తుందో లేదో గానీ..కులమతాలతో సంబంధం లేకుండా అన్ని పండుగల్ని కచ్చితంగా సెలెబ్రేట్ చేసేది సినీ ప్రముఖులే. అందుకే ఆ హీరో వేయించుకున్న పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ ఫోటో విశేషమేంటో తెలుసుకుందాం..

తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాష ఏదైనా సరే..చిత్ర పరిశ్రమ మాత్రం అన్ని మతాల్ని జరుపుకుంటుంది. అందరూ కలిసి సెలెబ్రేట్ చేసుకుంటారు. ఇందులో భాగంగానే క్రిస్మస్ వేడుకల్ని( Christmas celebrations ) సరదాగా జరుపుకున్నరా టాలీవుడ్ హీరోలు. డిసెంబర్ 25న మేరీ క్రిస్మస్ ( Merry Christmas ) సందర్బంగా సినీ ప్రముఖులు చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు తదితరులు సెలెబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కానీ ఓ హీరో షేర్ చేసిన పిక్ మాత్రం చాలా వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఓ హీరో ఏకంగా తన వీపుపై క్రిస్మస్ ట్రీ టాటూ ( Christmas tree tattoo ) వేయించుకుని చూపిస్తూ పోజిచ్చాడు. ఆ ఫోటోని తన బావైన మహేశ్ బాబు ( Mahesh babu )కు పంపిస్తూ క్రిస్మస్ విషెస్ అందించాడు. అదే ఇప్పుడు పిక్ ఆఫ్ ది వైరల్‌గా మారినట్టుంది. టాలీవుడ్‌లో సిక్స్‌ప్యాక్‌లో  ఆకట్టుకునే హీరోల్లో సుధీర్ బాబు ( Sudhir babu ) ఒకడు. తన సిక్స్‌ప్యాక్‌‌ను చూపిస్తూనే..వీపుపై వేయించుకున్న క్రిస్మస్ ట్రీ టాటూ ప్రదర్శిస్తున్న ఫోటో ఇది. అందుకే చాలా వైరల్ అవుతోంది ఈ ఫోటో. 

నానితో కలిసి ఇటీవల సుధీర్ బాబు చేసిన సినిమా వి..అంచనాల్ని అందుకోలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన వి సినిమా ( V movie ) ఫ్లాప్‌టాక్ మూటగట్టుకుంది. కానీ సుధీర్ బాబు క్రిస్మస్ ట్రీ టాటూ మాత్రం చాలా వైరల్‌గా మారింది. 

Also read: Alia Bhatt weds Ranbir kapoor: పెళ్లెప్పుడనేది ఖాయమైంది

Trending News