Gagana Maargan: పాన్ ఇండియా మర్డర్ మిస్టరీ గా రానున్న గగన మార్గన్‌.. విలన్ గా స్టార్ హీరో మేనల్లుడు పరిచయం..!

Vijay Antony Maargan: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో.. విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం గగన మార్గన్‌ అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరు చేస్తున్నారు అన్న విషయాన్ని.. సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేశారు సినిమా యూనిట్. 

Written by - Vishnupriya | Last Updated : Nov 24, 2024, 08:43 AM IST
Gagana Maargan: పాన్ ఇండియా మర్డర్ మిస్టరీ గా రానున్న గగన మార్గన్‌.. విలన్ గా స్టార్ హీరో మేనల్లుడు పరిచయం..!

Maargan Update:  బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న హీరో విజయ్ ఆంటోని. ఆ సినిమా తర్వాత నుంచి ఈ హీరో ప్రతి సినిమా తెలుగులో విడుదలై పర్వాలేదు అనిపించుకుంటున్నాయి.‌ ఈ క్రమంలో ప్రస్తుతం విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటిస్తున్న మర్డర్ మిస్టరీ - క్రైమ్ థ్రిల్లర్ గగన మార్గన్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికర సమాచారం తెగ వైరల్ అవుతుంది. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా.. మీరా విజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన విజయ్ ఆంటోని ఫస్ట్ లుక్ పోస్టర్‌కి ఇప్పటికే మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.  

Add Zee News as a Preferred Source

ఇక ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా ఎవరు చేయబోతున్నారు అనే విషయాన్ని బయట పెట్టారు సినిమా యూనిట్. ఈ సినిమాలో విలన్‌గా అజయ్ ధీషన్‌ను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్‌ను.. విడుదల చేశారు. అజయ్ ధీషన్ విజయ్ ఆంటోని మేనల్లుడు కావడం విశేషం. పోస్టర్‌లో కనిపించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇందులో అజయ్ ధీషన్, విజయ్ ఆంటోని మధ్య.. సాగే ఘర్షణ సన్నివేశాలు థ్రిల్ కలిగించనున్నట్లు అర్థమవుతోంది.  

ఇక ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రం పక్క యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్లు ఈమధ్యనే దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక బిచ్చగాడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ ఆంటోని.. ఆ తర్వాత ఆ సినిమా సీక్వెల్ కూడా చేశారు. బిచ్చగాడు 2 కూడా తెలుగులో పరవాలేదు అనిపించుకుంది. మరి ఇప్పుడు ఈ హీరో నటిస్తున్న ఈ సినిమా తమిళం తో పాటు తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

ఈ చిత్రంలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ యువ.ఎస్ చేయగా, సంగీతాన్ని స్వయంగా విజయ్ ఆంటోని సమకూర్చుతున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా రాజా.ఎ పనిచేశారు.  

"గగన మార్గన్" అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కబోతోంది. త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Read more: Garikapati Narasimharao: తగ్గెదేలా అంటావా..?.. మీ అందర్ని కడిగేస్తా.. పుష్పా- 2 మీద రెచ్చిపోయిన గరికపాటి.. వీడియో ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News