Vishal Mark Antony : చావు నుంచి తృటిలో తప్పించుకున్న విశాల్.. సెట్‌లో ప్రమాదం.. దూసుకొచ్చిన వాహనం

Mark Antony Set Accident మార్క్ ఆంటోని సెట్‌లో యాక్సిడెంట్‌ జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2023, 06:10 PM IST
  • విశాల్ సినిమా సెట్‌లో ప్రమాదం
  • అదుపుతప్పి దూసుకొచ్చిన వాహనం
  • ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం
Vishal Mark Antony : చావు నుంచి తృటిలో తప్పించుకున్న విశాల్.. సెట్‌లో ప్రమాదం.. దూసుకొచ్చిన వాహనం

Hero Vishal Mark Antony Set Accident కోలీవుడ్, టాలీవుడ్‌లో హీరో విశాల్‌కు మంచి డిమాండ్ ఉంది. అయితే విశాల్ తన సినిమాల కోసం భారీగా కష్టపడుతుంటాడు. రియల్ యాక్షన్ స్టంట్లు చేస్తుంటాడు. దీని వల్ల ఆయనకు ప్రతీ సినిమా షూటింగ్ సమయంలో ఏదో ఒక గాయం అవుతూనే ఉంటుంది. తాజాగా మార్క్ ఆంటోని సినిమా సెట్‌లో ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి చిత్రయూనిట్ మీదకు వచ్చింది. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.

విశాల్ చేసే ప్రతీ సినిమాకు ఇలాంటి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇలా మార్క్ ఆంటోని సినిమా సెట్‌లో జరిగిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై చిత్రయూనిట్ ఇంకా స్పందించలేదు. అధికారికంగా చిత్రయూనిట్ చేసే ప్రకటన తరువాతే అసలు విషయాలు బయటకు వస్తాయి.

 

ఈ షెడ్యూల్‌లో విశాల్ ఉన్నాడో లేదో? ఆ వాహనం నడిపింది ఎవరు? అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇలానే సినిమా సెట్‌లో జరిగే ప్రమాదంలో ఇది వరకు ఎంతో మంది టెక్నీషియన్లు మరణించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ ప్రమాద నుంచి విశాల్ తృటిలో తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. చావు నుంచి విశాల్ క్షణాల్లో తప్పించుకున్నాడని, ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు అని సమాచారం అందుతోంది. త్వరలోనే మళ్లీ ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభిస్తారని టాక్.

 

విశాల్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఎనిమి, లాఠీ, చక్ర అంటూ గత ఏడాది వచ్చాడు. కానీ ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. కానీ ప్రతీ సినిమా షూటింగ్ సమయంలో మాత్రం విశాల్ గాయాలపాలయ్యాడు. ఇక విశాల్ పెళ్లి మీద మాత్రం రూమర్లు ఇప్పుడు ఎక్కువ అయ్యాయి. నటితో విశాల్ ప్రేమ వ్యవహారం మీద రకరకాల రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే.
 

Also Read:  Rashmi on amberpet stray dog : కుక్కల దాడిలో పసిబిడ్డ మృతి.. కనికరం చూపించకుండా వాటికే యాంకర్ రష్మీ సపోర్ట్

Also Read: Prabhu Hospitalized : హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు.. కారణం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News