HIT టీజర్ వచ్చేసింది.. నాని మరో హిట్ కొడతాడా?

HIT movie Teaser | టాలీవుడ్ నేచురల్ స్టార్ నిర్మాతగానూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ‘అ!’ సినిమాతో హిట్ కొట్టిన నాని నిర్మాతగా హిట్ అనే మరో మూవీని నిర్మిస్తున్నాడు. హిట్ టీజర్ ను నాని విడుదల చేశాడు.

Last Updated : Jan 31, 2020, 12:16 PM IST
HIT టీజర్ వచ్చేసింది.. నాని మరో హిట్ కొడతాడా?

‘అ’ అనే వైవిధ్యమైన సినిమాతో నిర్మాతగా మారిన హీరో నాని. నిర్మాతగా తొలి సినిమాతోనే తన టేస్ట్ చూపించడంతో పాటు సక్సెస్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్ సేన్‌తో కలిసి ‘హిట్’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు నాని. ఈ సినిమా టీజర్‌ను హిట్ ప్రొడ్యూసర్ నాని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా రుహానీ శర్మ నటిస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీకి కొలను శైలేష్ దర్శకత్వం వహించారు.

Also Read: న్యూడ్ వీడియోలతో వేధిస్తున్నారు!: నటి ఆవేదన

‘ఈ జాబ్ నిన్ను రిస్క్‌ నాశనం చేస్తుంది విక్రమ్. నువ్వు ఈ డిపార్ట్‌మెంట్‌ నుంచి వదిలివెళ్లడం మంచిది’ అని ఓ యువతి విశ్వక్‌సేన్‌కు సలహా ఇస్తుంది.  తాను మాత్రం డిపార్ట్‌మెంట్‌ను వదిలేది లేదని హీరో తేల్చిపారేస్తాడు. మిస్సింగ్ కేసు తనకు ఇవ్వాలని పై అధికారిని కోరతాడు. అతడి కళ్లముందే ఒకరిని హత్య చేస్తారు. ఇలా సస్పెన్స్ థ్రిల్లర్‌గా మూవీ రాబోతుందని ప్రేక్షకులు భావిస్తారు. అంతలోనే హీరోయిన్ రుహానీ శర్మ, విశ్వక్ సేన్ లిప్ కిస్ సీన్ రావడం.. లవ్ యాంగిల్ కూడా ఉందని చెప్పకనే చెబుతోంది. ‘మీరు ఈ ఫిబ్రవరి నెలాఖర్లో సీట్లకు అతక్కుపోయి సినిమా చూస్తారని’ టీజర్ రిలీజ్ గురించి నాని ట్వీట్ చేశాడు.  Photo Gallery: మిని స్కర్ట్‌లో దిశా పటానీ.. హాట్ హాట్‌!

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News