Naresh Responds on Pavitra Lokesh: గత కొద్దిరోజులుగా నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ మధ్య పెళ్లి, సహజీవనం అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఒక కన్నడ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో తాను, నరేష్ సహజీవనం చేస్తున్నామని పవిత్ర లోకేష్ బయట పెట్టడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఈ అంశం మీద నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేష్ కు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉండేవంటూ ఆమె ఆరోపణలు చేయడమే కాక పవిత్ర లోకేష్ తమ మధ్య గొడవలు పెట్టిందంటూ వ్యాఖ్యలు చేయడంతో ఆ విషయం మీద నరేష్ కూడా కన్నడ మీడియా ద్వారా స్పందించారు.
తన మూడో భార్య రమ్య తనను డబ్బు కోసమే వాడుకుందని నరేష్ పేర్కొన్నారు. ఒక్కరోజు కూడా ఆమె తన భార్యలా ప్రవర్తించలేదని ఆమె గురించి చెప్పడానికే సిగ్గుగా ఉందని చెబుతూ తన దగ్గర పని చేసే ముస్లిం డ్రైవర్ తో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంది అనే విషయం తెలిసి తాను ప్రశ్నించానని దానికి చెత్త వివరణలు ఇచ్చిందని ఆయన సంచలన విషయాలు బయట పెట్టారు. అంతేకాదు ఇంట్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే దానికి మేల్ క్యాబరే డాన్సర్ ని తీసుకువచ్చి రచ్చ చేసింది అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఆమె నుంచి విడాకులు తీసుకోవాలి అనుకోలేదు కానీ ఇప్పుడు తప్పడం లేదని పేర్కొన్నారు.
అయితే ఆమె దగ్గర పెరుగుతున్న తన బిడ్డ కస్టడీ విషయంలోనే కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయం మీద ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇక పవిత్ర లోకేష్ గురించి ఆయన మాట్లాడుతూ తాము హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా షూటింగ్ సమయంలో మొట్టమొదటిసారి కలిసామని అయితే ఆమె అందరితో అంత ఈజీగా కలిసిపోయే మనిషి కాదని అన్నారు. సమ్మోహనం సినిమా షూటింగ్ సమయంలో మరింత దగ్గరయ్యామని అప్పటికి నా పరిస్థితి ఆమెకు తెలియడంతో కాస్త మంచి చెడ్డలు అడుగుతూ ఉండడంతో స్నేహం మొదలైందని చెప్పుకొచ్చారు. ఆమెతో కలిసి నాలుగైదు సినిమాలు చేశానన్న నరేష్ ఒకసారి ఒక ఫంక్షన్ లో కలిసి కనిపించాం, అలాగే కలిసి గుడికి వెళ్ళామని అంతమాత్రానికి ఏదో ఉందంటూ ప్రచారం చేయడం తగదన్నారు.
ప్రస్తుతం మనం 2022 సంవత్సరంలో ఉన్నాం ఇద్దరు స్నేహితులు కలిసి అలా బయటకు వెళ్లడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. తాను ఒక మగాడి కంటే ముందు మనిషినని ప్రతి మనిషికి ప్రేమగా మాట్లాడే వారు కావాలని తనతో ఆమె ప్రేమగా మాట్లాడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆమె తనకు ఒక గైడ్, వెల్విషర్ అంటూ ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఆమె మీద జరిపిన స్టింగ్ ఆపరేషన్ మీద నరేష్ మండిపడ్డారు. సాధారణ జనాలకు అన్యాయం జరుగుతున్న విషయాలపై ఇలాంటివి చేయాలి కానీ ఒకరి పర్సనల్ లైఫ్ మీద చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తమది పవిత్రమైన స్నేహ బంధమే తప్ప అంతకుమించి ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. కానీ స్టింగ్ ఆపరేషన్ లో మాత్రం పవిత్ర తాను నరేష్ సహజీవనం చేస్తున్నామని పేర్కొనడం గమనార్హం.
Also Read: Pushpa The Rule Auditions: 'పుష్ప'లో అల్లు అర్జున్ పక్కన నటించాలని ఉందా? .. ఇలా చేయండి చాలు!
Also Read: Vijay Devarakonda Lady Fan: అయ్య బాబోయ్.. మరీ ఇంత అభిమానమా! వీపుపై విజయ్ దేవరకొండ టాటూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook