Pawan Kalyan-Poorna: మెగా పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఎంతమంది అభిమానులు.. ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ని విపరీతంగా అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ బయటే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కూడా.. ఈయనకు అభిమానులు ఎక్కువే. నితిన్ లాంటి హీరోలు పవన్ కళ్యాణ్ జపం చేస్తూనే ఉంటారు. తాజాగా ఈ లిస్టులోకి ఒక హీరోయిన్ కూడా చేరింది. పవన్ కళ్యాణ్ అంటే తనకున్న.. అభిమానాన్ని చెప్పకనే చెప్పింది ఈ నటి.
రఘు బాబు దర్శకత్వంలో వచ్చిన అవును సినిమా ద్వారా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పూర్ణ. ఆ తరువాత పలు సినిమాలలో నటించిన ఈ నటికి.. పెద్దగా విజయాలు మాత్రం రాలేదు. అయితే ఈ మధ్య మహేష్ బాబుతో చేసిన కుర్చీ మడత పెట్టి సాంగ్.. పూర్ణాకి ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ పాట వచ్చినప్పటి నుంచి.. పూర్ణాకి మరిన్ని ఐటమ్ సాంగ్స్ క్యూ కట్టడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో పూర్ణ, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయానికి వస్తే ఈ మధ్య పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన..ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో.. 21 స్థానాల్లో పోటీ చేసి గెలిచినప్పుడు.. సినీ పరిశ్రమలోని చాలా మంది సెలబ్రిటీలు పవన్ కి అభినందనలు తెలుపుతూ పోస్టులు వేశారు. కొంతమంది స్వయంగా పవన్ కళ్యాణ్ ని కలిసి మరీ అభినందించారు. అయితే ఇప్పుడు పూర్ణా మాత్రం.. పవన్ కళ్యాణ్ తో ఒక ఫోటో కావాలి అంటూ నిహారికని రిక్వెస్ట్ చేసింది.
నిహారిక తాజాగా ఈటీవీలో జరిగే డ్రామా జూనియర్స్ షోకి గెస్ట్ గా వచ్చింది. ఓక ఈ షోలో పవన్ కళ్యాణ్ గురించి పిల్లలు ఒక స్కిట్ వేశారు. ఈ స్కిట్ అయ్యాక ఈ షోకి ఒక జడ్జిగా చేస్తున్న నటి పూర్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ పై స్కిట్ అయ్యాక పూర్ణ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ నిహారిక.. నాకు ఒకసారి ఎప్పుడైనా ఆయనతో ఒక్క ఫోటో ఇప్పించరా”.. అంటూ తెగ క్యూట్గా రిక్వెస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు పూర్ణ చేసిన మాటలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read more: Telangana: ఫుల్ జోష్ లో గులాబీ బాస్.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్ లోకి ఆ ఎమ్మెల్యేలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter