Taapsee: ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?: నటి తాప్సీ

ఇంట్లో మహిళలు తమ ఆత్మ గౌరవం కోసం ఎలా నిలబడతారు, వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాలను తాప్సీ పన్ను నటిస్తున్న సినిమాలో చూపించనున్నారు.

Last Updated : Feb 6, 2020, 12:17 PM IST
Taapsee: ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?: నటి తాప్సీ

తెలుగు సినిమాలతో సినీ అరంగుట్రం చేసిన హీరోయిన్ తాప్సీ పన్ను. ఇక్కడ అంతగా కలిసిరాలేదని బాలీవుడ్ వెళ్లి అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె లేటెస్ట్ సినిమా ‘థప్పడ్‌’. ఇంట్లో మహిళలు పడే బాధ, మానసిక వేదనను దర్శకుడు అనుభవ్ సిన్హా ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న తాప్సీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’పై సంచలన వ్యాఖ్యలు చేసింది. హింస జరుగుతుంటే జనాలు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారో అర్థం కావడం లేదంటోంది.

Also Read: #RRR మూవీ అప్‌డేట్‌పై ఫన్నీ ట్రోల్స్.. నవ్వకుండా ఉండండి చూద్దాం!

‘బిగ్ బాస్ రియాల్టీ షోలలో హింస జరగుతుంది. అయినా ప్రేక్షకులు అది చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అది హాస్యం మాత్రం కాదు. మనకు అక్కడ కనిపించేది జోక్‌గా అనిపించవచ్చు. కానీ అందులో ఉన్నవారికి బాధ కలిగించే అంశం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మన ఆలోచన తీరు మారుతుంది. కానీ ఇలా చేయడానికి ఒక్కో మనిషికి ఒక వ్యవధి తీసుకుంటారు. చివరికి ఆలోచనల్లో మార్పు రావడం ఖాయం.

Also Read: ఏ అమ్మాయిని వేధించలేదు: కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్

భిన్న మనస్తత్వాలు కలిగిన వారు ఒకే ఇంట్లో ఉండటం అంత తేలిక కాదు. రాను రాను ఇలాంటి షోలలో హింస పెరిగిపోతుంది. కుటుంబంతో కలిసి చూసేలా లేదు. కానీ వీటిని చూస్తూ ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. సమాజాన్ని ఒక్క సినిమా మార్చలేదు. ఆలోచనా విధానం మారితేనే మార్పు సాధ్యమని’ తాప్సీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అందరిముందు భర్త కొట్టిన ఒక్క చెంపదెబ్బతో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది థప్పడ్ సినిమాలో చూపించబోతున్నారు. ఫిబ్రవరి 28న సినిమా విడుదల కానుంది.

See Pics; ప్రేయసితో హీరో నిఖిల్ నిశ్చితార్థం.. ఫొటోలు

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News