Adipursh 3D Teaser Screening: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఆదిపురుష్ టీమ్.. మీడియాకు స్పెషల్ స్క్రీనింగ్!

Adipursh Team Arranges Special 3D Teaser Screenings for Media: ఆదిపురుష్ టీజర్ మీద నెగటివ్ టాక్ విపరీతంగా రావడంతో ఇప్పుడు సినిమా యూనిట్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్లో ఒక 3డీ స్క్రీనింగ్ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 5, 2022, 05:05 PM IST
Adipursh 3D Teaser Screening: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఆదిపురుష్ టీమ్.. మీడియాకు స్పెషల్ స్క్రీనింగ్!

Adipursh Team in damage control: Arranges Special 3D Teaser Screenings for Media: వరుస సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ ఒక్కొక్క సినిమా విడుదల చేసుకుంటూ వస్తున్నారు. చివరిగా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న ప్రభాస్ త్వరలో ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ 2023వ సంవత్సరంలో విడుదలవుతుంది. అయితే ఇప్పటి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున ప్రారంభించింది సినిమా యూనిట్.

అక్టోబర్ రెండో తేదీన ఈ సినిమా టీజర్ను అయోధ్య వేదికగా విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల వేడుకకు ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ వంటి వారు హాజరయ్యారు. అయితే ఈ టీజర్ వచ్చినప్పటి నుంచి టీజర్ మీద రకరకాల ట్రోలింగ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రభాస్ లాంటి హీరో ఉన్న సినిమా టీజర్ ఇలా ఉండటం ఏమీ బాలేదని అంటున్నారు. కొందరైతే అసలు కార్టూన్ క్యారెక్టర్లతో ఎందుకు ఇలా చేశారు అని కూడా కామెంట్ చేస్తున్నారు.

ఇప్పుడు దానికి తోడు హనుమంతుడి వేషధారణలో ఉన్న దేవదత్త నాగే తోలు దుస్తులు ధరించడం మీద కూడా వివాదం చాలా రేగింది. హనుమంతుడు తోలు దుస్తులు ధరిస్తాడా? అంటూ మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అంతేకాక ఈ విషయం మీద అవసరమైతే లీగల్ చర్యలకు కూడా వెనుకాడేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అయితే టీజర్ మీద ఇంత ట్రోలింగ్ జరుగుతుంటే ఓం రౌత్ దానికి మరింత ఆజ్యం పోసే విధంగా కామెంట్ చేశారు.

సినిమా రూపొందించింది ఈ ఫోన్లో చూసేందుకు కాదని ఐమాక్స్ 3d తెరల మీద చూస్తేనే ఆ సినిమా మజా ఏంటో అర్ధం అవుతుందని ఆయన కామెంట్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఫ్యాన్స్ సహా మీడియా కూడా తీవ్రస్థాయిలో సినిమా టీజర్ పై నెగిటివ్ గా స్పందిస్తూ ఉండడం రకరకాల ప్రచారాలు మొదలవుతూ ఉండడంతో సినిమా యూనిట్ ఇప్పుడు ఆత్మ రక్షణ చర్యలకు దిగింది. రేపు ప్రభాస్ దర్శకుడు ఓమ్ రౌత్ కలిసి ఈ టీజర్ను తెలుగు మీడియా ప్రతినిధులకు హైదరాబాదులోని ఏఎంబి థియేటర్లో 3డీలో ప్రదర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత సినిమాకు సంబంధించి మీడియా ప్రతినిధులతో ప్రభాస్ ముచ్చటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Also Read: Divi in God Father: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినిమా మలుపు తిప్పే పాత్రలో దివి!

Also Read: Mega hero in God Father: చిరంజీవి కాకుండా గాడ్ ఫాదర్ లో మరో మెగా హీరో.. ఏ పాత్రలో నటించాడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News