HIT 2 Teaser : ప్రభాస్ అన్నట్టు రొమాన్స్ కూడా ఉండాలి.. వాటిపై అడివి శేష్ క్లారిటీ

Adivi sesh Hit 2 Teaser అడివి శేష్ హీరోగా రాబోతోన్న హిట్ 2 మూవీ ప్రస్తుతం చిక్కుల్లో పడింది.యూట్యూబ్‌ నుంచి ఈ మూవీ టీజర్‌ తొలగించేశారు. హింసను ప్రేరేపించేలా ఉందని, ఏజ్ లిమిట్ పెట్టేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2022, 05:48 PM IST
  • యూట్యూబ్‌లో హిట్ 2 టీజర్ మీద ఆంక్షలు
  • కేవలం పెద్ద వారికి మాత్రమేనన్న యూట్యూబ్
  • అసలు విషయం చెప్పిన అడివి శేష్
HIT 2 Teaser : ప్రభాస్ అన్నట్టు రొమాన్స్ కూడా ఉండాలి.. వాటిపై అడివి శేష్ క్లారిటీ

Hit 2 Teaser Restricted in youtube : నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకుడిగా వచ్చిన హిట్ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. అందులో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. అయితే ఈ మూవీ ఫ్రాంచైజీలా ఇక కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో భాగంగా రెండో పార్ట్‌కు సంబంధించిన అప్డేట్లు వస్తోన్న సంగతి తెలిసిందే. హిట్ 2 టీజర్ అందరినీ నిజంగానే భయపెట్టేసింది. అందులో చూపించిన సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా అనిపించాయి. క్రైమ్ సీన్స్ మామూలుగా ఉండేట్టు కనిపించడం లేదు.

అయితే ఇలాంటి కంటెంట్ మీద సోషల్ మీడియా ఆంక్షలు విధిస్తున్న సంగత తెలిసిందే. తాజాగా హిట్ 2 టీజర్ మీద యూట్యూబ్ ఆంక్షలు విధించింది. ఈ టీజర్‌ను యూట్యూట్ తొలగించింది. ఇకపై ఈ టీజర్‌ను చూడాలంటే 18+ అయి ఉండాలి.. దాని కోసం స్పెషల్‌గా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. 18+ వారికే ఈ టీజర్ ఇకపై యూట్యూబ్‌లో కనిపిస్తుందన్న మాట.

 

దీనిపై అడివి శేష్ స్పందించాడు. మా డైరెక్టర్ నాకు ఈ టీజర్ చూపించినప్పుడే ఇలాంటి రోజు వస్తుందని అనుకున్నాను.. వచ్చింది.. మా టీజర్ మీద యూట్యూబ్ ఆంక్షలు విధించింది.18+ అయితే టీజర్ చూడొచ్చు అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో వయెలెన్స్ కాకుండా రొమాన్స్ కూడా ఉందని అడివి శేష్ అన్నాడు.

ప్రభాస్ గారు చెప్పినట్టుగా ఎప్పుడూ వయెలెన్సేనా? రొమాన్స్ కూడా ఉండాలన్నట్టుగా మా సినిమాలో అది కూడా ఉంది.. రేపు ఉరికే ఉరికే పాట రిలీజ్ కాబోతోంది ఎంజాయ్ చేయండి అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి హిట్ 2 మూవీ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సినిమా కూడా హిట్ అయితే మాత్రం.. మూడో పార్ట్ కోసం మరో పెద్ద స్టార్‌ను నాని పట్టేసేట్టు కనిపిస్తోంది. 

Also Read : Sudigali Sudheer : స్టేజ్ మీద కలిసి కలిసిన జోడి.. భాను శ్రీ పాట.. ఏడ్చిన రష్మీ.. నెటిజన్ల ట్రోలింగ్

Also Read : Jabardasth Nookaraju : కాంతార క్లైమాక్స్.. జీవించేసిన జబర్దస్త్ నూకరాజు.. దండం పెట్టాల్సిందే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News