Goodachari 2  అప్డేట్.. ఏజెంట్ గోపీ వచ్చేశాడోచ్.. గురి పెట్టిన అడివి శేష్

Adivi sesh Goodachari 2 అడివి శేష్ తన కథలను తానే రాసుకుంటాడు. లేదా తన ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో కలిసి రాసుకుంటాడు. కథా చర్చల్లో పాల్గొంటాడు. అలా తనకు నచ్చిన జానర్లను, తనకు నచ్చిన కథలను ఎంచుకుంటూ పోతోన్నాడు. అందుకు వరుసగా విజయాలు అందుకుంటున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2023, 05:24 PM IST
  • కొత్త సినిమాతో అడివి శేష్ రెడి
  • హిట్ 2 సక్సెస్ జోష్‌లో హీరో
  • గూఢాచారి 2పై అప్డేట్ ఇచ్చిన అడివి శేష్
Goodachari 2  అప్డేట్.. ఏజెంట్ గోపీ వచ్చేశాడోచ్.. గురి పెట్టిన అడివి శేష్

Adivi sesh Goodachari 2 అడివి శేష్ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. ఫ్లాప్ అనే పదం కూడా అడివి శేష్‌కు ఆమడ దూరంలో ఉంటోంది. ఎవరు, మేజర్, హిట్ 2 ఇలా హిట్లు కొడుతూనే ఉన్నాడు. ఏ జానర్‌ టచ్ చేసినా కూడా అడివి శేష్ తన మార్క్ చూపిస్తున్నాడు. రీమేక్ చేసినా కూడా తన ముద్ర కనిపించేలానే చేస్తున్నాడు. అలా బాద్లా సినిమాకు మార్పులు చేర్పులు చేసి తీసిన ఎవరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన మేజర్ సినిమా సూపర్ హిట్ అయింది.

నాని నిర్మంచగా.. శైలేష్ కొలను తీసిన హిట్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిట్ యూనివర్స్‌లో ఓ హీరోగా అడివి శేష్ ఫిక్స్ అయ్యాడు. అలా అడివి శేష్ కెరీర్ ప్రస్తుతం మంచి ఫాంలో ఉంది. అయితే అడివి శేష్ చేయాల్సిన ఓ సినిమాను పక్కన పెట్టేసినట్టున్నాడు. శివాని రాజశేఖర్ హీరోయిన్‌గా టూ స్టేట్స్ అనే సినిమాను రీమేక్ చేసేందుకు అడివి శేష్ అంగీకరించాడు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు.

 

కానీ మధ్యలోనే ఆ సినిమాను ఆపేసినట్టు తెలుస్తోంది. అడివి శేష్‌ కావాలనే ఆ సినిమాను పక్కన పెట్టినట్టు టాక్. అయితే అడివి శేష్ తన కెరీర్ కోసమే అలా చేసినట్టు తెలుస్తోంది. అడివి శేష్ అయితే ఇప్పుడు గూఢచారి 2 పనులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కథ, కథనాలు అన్నీ కూడా అడివి శేష్ సమకూర్చుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని అభిషేక్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాలా సంగీతాన్ని అందిస్తున్నాడు. మేజర్, గూఢచారి వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన వినయ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ప్రారంభించి, షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Keerthy Suresh Bikini : బికినీలో కీర్తి సురేష్‌.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించే పిక్స్

Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News