Aishwarya Rai Pregnant: మరోసారి తల్లవుతున్న ఐశ్వర్య రాయ్.. ఈ వీడియోనే సాక్ష్యం!

Is Aishwarya Rai Bachchan pregnant for second time. మాజీ ప్ర‌పంచ సుంద‌రి, అభిషేక్ బ‌చ్చ‌న్ స‌తీమ‌ణి మరోసారి గర్భవతి అయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 19, 2022, 08:25 PM IST
  • మరోసారి తల్లవుతున్న ఐశ్వర్య రాయ్
  • ఈ వీడియోనే సాక్ష్యం
  • చేతిని పొట్ట భాగానికి అడ్డుగా పెట్టుకుని
Aishwarya Rai Pregnant: మరోసారి తల్లవుతున్న ఐశ్వర్య రాయ్.. ఈ వీడియోనే సాక్ష్యం!

Is Aishwarya Rai Bachchan pregnant for second time: మాజీ ప్ర‌పంచ సుంద‌రి, అభిషేక్ బ‌చ్చ‌న్ స‌తీమ‌ణి మరోసారి గర్భవతి అయ్యారా?.. బచ్చన్‌ ఫ్యామిలీకి మరో వారసుడు లేదా వారసురాలు రానున్నారా? అంటే అవుననే సమాధానం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు ఓ బలమైన కారణం ఉంది. అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్‌, ఆరాధ్య ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చేప్పుడు.. ఫొటో గ్రాఫర్లు వారి ఫొటోలు తీయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆ స‌మ‌యంలో ఐశ్వ‌ర్య తన చేతిని పొట్ట భాగానికి అడ్డుగా పెట్టుకుని ముందుకు నడిచారు. చాలా వరకు ఐష్ తన బెల్లీని దాచి ఉంచే ప్రయత్నం చేశారు.

ఐశ్వర్య రాయ్ వదులు డ్రెస్ వేసుకుని తన కూతురు ఆరాధ్య  చేయి పట్టుకుని ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చారు. అభిషేక్ బ‌చ్చ‌న్ వెనకాల ఉన్నారు. ఐష్ తన బెల్లీని పూర్తిగా దాచి ఉంచే ప్రయత్నం చేశారు. తల్లీకూతుళ్ల మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్ ఫొటోస్, వీడియోలు  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఐశ్వర్య రెండోసారి గర్భవతి అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఐశ్వర్య కాని, బచ్చన్‌ ఫ్యామిలీ కానీ ఈ విషయంపై స్పందించలేదు. 2007 ఏప్రిల్‌ 20న ఐశ్వర్య, అభిషేక్‌ల వివాహమైంది. 2011 నవంబర్‌ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.

తాజాగా ఐశ్వర్య రాయ్ 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2022కు భర్త అభిషేక్ బచ్చన్‌, కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లారు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వ‌ర్య‌ మెరిసిపోయారు. బ్లాక్ క‌ల‌ర్ వాలెంటినో గౌన్‌లో ఐశ్వ‌ర్య హోయ‌లు పోయారు. అయితే కేన్స్ 2022 అనంతరం తిరుగు ప్రయాణంలో ఆమె కెమెరాలకు చిక్కారు. అప్పుడు కూడా ఐశ్వర్యకు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. అప్పుడు కూడా ఐశ్వర్య తన పొట్ట కనిపించకుండా కవర్ చేసుకున్నారు. దీంతో ఐష్ ప్రగ్నెంట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఏదేమైనా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. పూర్తి స్పష్టత రావాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఇటీవలి కాలంలో ఐశ్వర్య రాయ్ పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఐష్‌ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్‌ ఫిక్షన్‌ స్టోరీ 'పొన్నియన్‌ సెల్వన్‌-1లో 'నటించారు. ఆమెకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఇక మణిరత్నం డైరెక్ట్ చేసిన 'గురు' సినిమా స‌మ‌యంలోనే అభిషేక్ బ‌చ్చ‌న్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు ఐష్. ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా సినిమాల‌ను చేస్తూనే ఉన్నా.. ఎక్కువ స‌మ‌యాన్ని ఫ్యామిలీకే కేటాయించారు. 2018లో విడుదలైన 'ఫన్నీ ఖాన్' సినిమాలో ఐశ్వర్య నటించారు. ఆ తర్వాత సినిమాలు చేయలేదు. దేవదాస్, మోహబత్తేన్, గురు, గుజారిష్, తాల్, జోష్, ధూమ్ 2, జోధా అక్బర్, రోబో, రావణ్, సర్కార్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఐశ్వ‌ర్య‌ ఖాతాలో ఉన్నాయి. 

Also Read: Sheep Girl Video: గెలికితే ఊరుకుంటుందా మరి.. అందమైన యువతిని అక్కడ గుద్దిన గొర్రె!

Also Read: Google Trending Video: పాకిస్థాన్‌లో దారుణం.. ఒంటరి మహిళను చూసి, వెనకాల నుండి వచ్చి..!!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x