CM Pellam: 'సీఎం పెళ్లాం'తో అంత ఈజీ కాదు బాసూ.. మరోసారి వచ్చేస్తున్న హిట్ కాంబో..!

CM Pellam Teaser: సీఎం పెళ్లాం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. త్వరలోనే థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉందని చిత్రబృందం చెబుతోంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 16, 2024, 10:38 PM IST
CM Pellam: 'సీఎం పెళ్లాం'తో అంత ఈజీ కాదు బాసూ.. మరోసారి వచ్చేస్తున్న హిట్ కాంబో..!

CM Pellam Teaser: జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ కీలక పాత్రల్లో గడ్డం వెంకట రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సీఎం పెళ్లాం. ఆర్‌కే సినిమాస్ బ్యానర్‌పై బొల్లా రామకృష్ణ రెడ్డి నిర్మించిన ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అజయ్, ఇంద్రజ భార్యాభర్తలుగా నటించిన దిక్కులు చూడకు రామయ్య ఎంత హిట్ అయిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. మూవీ యూనిట్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మంచి మెసేజ్‌ఫుల్ మూవీ అని అన్నారు. ఆడియన్స్‌కు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుందన్నారు. సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకు వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించామన్నారు. ఆడియన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read: Amala Paul: పండుగ నాడు కొడుకు ముందే అతడికి లిప్ కిస్ పెట్టిన హీరోయిన్

ప్రొడ్యూసర్ బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ.. డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి తనకు మంచి స్క్రిప్ట్ వినిపించారని.. వెంటనే సినిమాను మొదలు పెట్టామన్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందని.. మంచి మెసేజ్ కూడా ఉంటుందన్నారు. ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ.. తాను ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించానని.. రోటిన్‌కు భిన్నమైన క్యారెక్టర్‌లో కనిపిస్తానని అన్నారు. డైరెక్టర్ వెంకట రమణారెడ్డి మంచి స్క్రిప్ట్ రెడీ చేశారని.. ఆయన డెడికేషన్ నచ్చిందన్నారు. తనతోపాటు ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారని అన్నారు. ఇంద్రజ గతంలో తనతో పాటు హీరోయిన్‌గా యాక్ట్ చేసిందని.. మళ్లీ ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు.

నటి ఇంద్రజ మాట్లాడుతూ.. సుమన్‌తో కలిసి తాను ఎన్నో సినిమాలు చేశానని.. ఆయన మంచి మనసు అప్పుడు ఇప్పుడూ ఒకేలా ఉందని అన్నారు. అప్పటికే ఆయన స్టార్ హీరో అయినా.. కొత్త హీరోయిన్‌గా వచ్చిన తనకు ఎంతో గౌరవం ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ఇదొక ప్రత్యేక సినిమా అని అన్నారు. అజయ్‌తో మరోసారి నటించడం హ్యాపీగా ఉందన్నారు. నటుడు అజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను లీడ్ రోల్ చేశానని.. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అన్నారు. రాజకీయాలు ఇలా ఉంటే బాగుంటుంది.. ఇలా ఉంటే సమాజానికి మంచి జరుగుతుందని చెప్పే చిత్రమన్నారు. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ.. డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి దర్శకత్వం మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చారని అన్నారు. ఆయన 20 ఏళ్ల కిందట ప్రకాష్ రాజ్‌తో ఓ సినిమా రూపొందించారని.. ఆ తరువాత యూఎస్ఏ వెళ్లిపోయి అక్కడ బాగా స్థిరపడిపోయారని అన్నారు. కానీ సినిమా మీద ప్యాషన్‌తో మళ్లీ వచ్చి ఈ సినిమాను తెరకెక్కించారని అన్నారు. ఆయనకు ఈ మూవీతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

Also Read: Amala Paul: పండుగ నాడు కొడుకు ముందే అతడికి లిప్ కిస్ పెట్టిన హీరోయిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News