Akhanda Movie Poster: బాలయ్య బర్త్‌డే గిఫ్ట్‌గా విడుదలైన అఖండ సినిమా పోస్టర్

Akhanda Movie Poster: నందమూరి బాలయ్య అభిమానులకు ఇదొక శుభవార్త. బాలయ్య బాబు బర్త్‌డే నాడు అభిమానులకు అమితానందం కల్గించే విషయం. బోయపాటి , బాలయ్య కాంబినేషన్ మూవీ పోస్టర్ ఒకరోజు ముందే విడుదలైంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 9, 2021, 08:00 PM IST
Akhanda Movie Poster: బాలయ్య బర్త్‌డే గిఫ్ట్‌గా విడుదలైన అఖండ సినిమా పోస్టర్

Akhanda Movie Poster: నందమూరి బాలయ్య అభిమానులకు ఇదొక శుభవార్త. బాలయ్య బాబు బర్త్‌డే నాడు అభిమానులకు అమితానందం కల్గించే విషయం. బోయపాటి , బాలయ్య కాంబినేషన్ మూవీ పోస్టర్ ఒకరోజు ముందే విడుదలైంది.

సింహ, లెజెండ్ హిట్స్ తరువాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తున్న మరో సెన్సేషనల్ మూవీ అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయన్‌గా పూర్ణ కీలకపాత్రలో కన్పించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వివిధ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. ఉగాది కానుకగా రోర్ పేరుతో వదిలిన టీజర్ భారీగా వైరల్ అవుతోంది.

ఇప్పుడు బాలయ్య 61వ పుట్టిన రోజు(Balakrishna Birthday) సందర్భంగా అంటే జూన్ 10 వ తేదీన బాలయ్య (Balakrishna)అభిమానులు సందడి చేసుకోనున్నారు. కొద్దిరోజులుగా ఎదురు చూస్తున్న అఖండ మూవీ పోస్టర్ బాలయ్య బర్త్‌డే గిఫ్ట్‌గా ఒకరోజు ముందుగానే విడుదలైంది. బాలయ్యకు బర్త్‌డే విషెత్ చెబుతూ నిర్మాతలు ఈ పోస్టర్ విడుదల చేశారు. అఖండ పోస్టర్‌(Akhanda poster released)లో బాలయ్య నవ్వుతూ..సైల్‌గా నడుచుకుంటూ వస్తున్నాడు. కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ స్టిల్ సినిమాలో ఓ పాటలోదని తెలుస్తోంది. అఖండ పోస్టర్ విడుదలవుతూనే బాలయ్య అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా కన్పించనుండటం ప్రత్యేకత.

Also read: Bimbisara: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీకి NTR వాయిస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News