Salman Khan in Telugu: బాలీవుడ్ దిగ్గజ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలిసారిగా తెలుగులో నేరుగా నటించబోతున్నాడు. మెగాస్టార్ అడిగిన వెంటనే కాదనకుండా ఓకే చెప్పిన సల్మాన్ ఖాన్ ఏమంటున్నాడంటే.
బాలీవుడ్ మేటి నటుడు..ప్రేమ పావురాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువై అప్పట్నించి ప్రత్యేక అభిమానాన్ని పొందుతున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు తొలిసారిగా నేరుగా తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటి వరకూ సల్మాన్ ఖాన్ హిందీ సినిమాలను రీమేక్ లేదా డబ్బింగ్ రూపంలోనే మనం చూస్తూ వస్తున్నాం. ఈసారి నేరుగా తెలుగులోనే నటించడం చూస్తాం. అది కూడా ఎవరితోనో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
టాలీవుడ్ దిగ్గజ నటుడు, మెగాస్టార్ చిరంజీవి, మరో ప్రమఖ నటుడు వెంకటేశ్ సరసన సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడు. ఆశ్చర్యంగా ఉందా. నిజమే. మహేశ్ వి మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన, సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ నటించిన అంతిమ్ సినిమా ప్రొమోషన్ నిమిత్తం హైదరాబాద్ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.
తన సినిమా విడుదలకు ముందే దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్ చేయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తుంటానని చెప్పాడు సల్మాన్ ఖాన్. అయితే టైగర్ 3 షూటింగ్ వల్ల ఈసారి కుదరలేదన్నాడు. నవంబర్ 26 న విడుదలైన అంతిమ్ సినిమాకు (Antim Movie)ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని సల్మాన్ చెప్పాడు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఈ సినిమాను ఆదరిస్తున్న ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. దబాంగ్ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశామని..కోవిడ్ కారణంగా అంతిమ్‌కు సమయం లేకపోయిందన్నాడు. అనంతరం తన తొలి తెలుగు సినిమా గురించి మాట్లాడారు.
రామ్‌చరణ్, చిరంజీవిలు తనకు మంచి స్నేహితులని..వెంకటేశ్ కూడా బాగా తెలుసని సల్మాన్ ఖాన్(Salman Khan) వెల్లడించాడు. తాను నేరుగా తెలుగులో నటిస్తున్నానని ప్రకటించారు. గాడ్ ఫాదర్(God Father movie) చిత్రంలో చేయమని చిరంజీవి(Chiranjeevi) కోరినప్పుడు పాత్ర ఏంటి, ఎన్ని రోజులు షూటింగ్ వివరాలేవీ అడగకుండానే ఓకే చెప్పేశానన్నారు. వెంకటేశ్‌తో కూడా నటిస్తున్నానన్నారు. మాస్, క్లాస్, మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ అంటూ ప్రత్యేకంగా ఆలోచించనని..కధ నచ్చితే చాలు సినిమా ఓకే చేస్తుంటానన్నాడు సల్మాన్ ఖాన్. ఓటీటీలో విడుదల చేస్తే సినిమా లాభాలకు గ్యారంటీ ఉంటుందని..థియేటర్లలో ఆ పరిస్థితి ఉండదన్నాడు.
Also read: Mahesh Babu Knee Surgery: మహేష్ బాబు మోకాలికి సర్జరీ.. ట్విట్టర్ లో ట్రెండింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook