Ala Vaikunthapurramuloo Hindi : కార్తిక్ ఆర్యాన్‌కు చెక్.. నేడే హిందీలో అల వైకుంఠపురములో సినిమా

Ala Vaikunthapurramuloo Hindi అల వైకుంఠపురములో సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. హిందీలోనూ ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. అందుకే రీమేక్ రైట్స్ కొని మరీ రీమేక్ చేశారు. కార్తిక్ ఆర్యాన్ హీరోగా షెహ్జాదా సినిమాను రూపొందించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 02:03 PM IST
  • హిందీలో రాబోతోన్న అల వైకుంఠపురుములో
  • ఫిబ్రవరి 10న రాబోతోన్న కార్తిక్ ఆర్యాన్ షెహ్జదా
  • డబ్బింగ్ రూపంలో కార్తిక్ ఆర్యాన్‌కు చెక్
Ala Vaikunthapurramuloo Hindi : కార్తిక్ ఆర్యాన్‌కు చెక్.. నేడే హిందీలో అల వైకుంఠపురములో సినిమా

Ala Vaikunthapurramuloo Hindi అసలు ఇప్పుడు రీమేక్ సినిమాలు ఆడటమే చాలా కష్టంగా మారిపోయింది. ఓటీటీలు, యూట్యూబ్‌లో సబ్ టైటిల్స్‌తో సినిమాలు చూస్తేస్తున్నారు. కరోనా సమయంలో అన్ని భాషల చిత్రాలు, అన్ని ప్రాంతాల ప్రేక్షకులు చూసేశారు. కరోనా సమయంలోనే ఈ అల వైకుంఠపురుములో సినిమాను రీమేక్ చేయాలని బాలీవుడ్ అనుకుంది. కార్తిక్ ఆర్యాన్‌ను హీరోగా పెట్టి షెహ్జాదాగా తీయాలని ఫిక్స్ అయింది. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‌లో పెరిగింది.

దీంతో అల వైకుంఠపురములో  సినిమాను కూడా హిందీలో డబ్ చేసి రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కార్తీక్ ఆర్యాన్ తన మేకర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఒక వేళ హిందీలో ఆ సినిమా వస్తే.. నేను ఈ రీమేక్ చేయను అని వార్నింగ్ ఇచ్చాడట. దీంతో సదరు నిర్మాతలు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. హిందీలో డబ్బింగ్ కాకుండా ఆపారు.

అయితే ఈ సినిమాను డబ్బింగ్ రూపంలో యూట్యూబ్‌లో, శాటిలైట్ చానెల్‌లో మాత్రం రిలీజ్ చేస్తారట. ఇది కూడా షహ్జాదా సినిమా రిలీజ్ అయిన తరువాత చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వారు కార్తిక్ ఆర్యాన్‌కు చెక్ పెట్టేశారు. షెహ్జాదా సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతోంది. అంతకు ముందు ఒరిజినల్ సినిమాను డబ్బింగ్ రూపంలో తీసుకురాబోతోన్నారు.

 

మేం మామూలుగా అయితే ఈ సినిమాను ఆలస్యంగానే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరిక మేరకు ముందుగానే తీసుకొస్తున్నాం.. మా గోల్డ్ మైన్స్ శాటిలైట్ చానెల్లో ఈ సినిమా ఫిబ్రవరి 5న మధ్యాహ్నాం 1.40 గంటలకు ప్రసారం కాబోతోంది.. ఆ తరువాత మళ్లీ ఫిబ్రవరి 18న రాత్రి ఎనిమిది గంటలకు రాబోతోందని ప్రకటించారు.

Also Read:  AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్

Also Read: Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News