Allu Aravind: స్టార్ హీరోల రెమ్యూనరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత

Allu Aravind on Heroes Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అరవింద్ కి ప్రత్యేక స్థానం ఉంది. అల్లు అరవింద్ ఒక సినిమా తీస్తున్నారు అంటే తప్పకుండా ఆ సినిమాలో ఏదో విషయం ఉంటుంది అని ప్రేక్షకుల నమ్మకం. ఆయన తీసిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్లగా మిగిలాయి. ఇక నిర్మాతగా అంత పేరు తెచ్చుకున్న అల్లవరం ప్రస్తుతం హీరోల రెమ్యునరేషన్ అలానే సినిమా బడ్జెట్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వల్ల అవుతున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2023, 09:57 AM IST
Allu Aravind: స్టార్ హీరోల రెమ్యూనరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత

Allu Aravind: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గత అయిదేళ్ళుగా భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. స్టార్ హీరో లు అయిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళే కాకుండా రవితేజ, నాని లాంటి హీరో లు కూడా ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఇండస్ట్రీ లో గాని బయట గాని హీరో ల వల్లే సినిమా బడ్జెట్ అనేది పెరిగిపోతుంది, హీరో లే బడ్జెట్ పెంచేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే పారితోషకం వల్లే సగం బడ్జెట్ పెరుగుతుంది అనేది అందరికి ఉంది.

అయితే ఇదంతా జస్ట్ భ్రమ మాత్రమే అని సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు అన్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు కోట బొమ్మలి పి.ఎస్ అనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఆయన స్పీచ్ ఇస్తూ హీరో వల్ల సినిమా బడ్జెట్ పెరగడం లేదు అని తేల్చి చెప్పేసారు.

ఇప్పటి కాలం లో పాన్ ఇండియా క్రేజ్ వల్ల సినిమా బడ్జెట్ లు పెరుగుతున్నాయే కానీ, హీరో ల వల్ల సినిమా బడ్జెట్ ఎప్పుడు పెరగలేదు అని ఆయన అన్నారు. అసలు సినిమా నిర్మాణం లో హీరో కి మిగిలేది 20 నుంచి 25 శాతం మాత్రమే, దాని వల్ల సినిమా బడ్జెట్ అనేది అస్సలు పెరగదు అని చెప్పేసారు అల్లు అరవింద్ గారు.

అలాగే ఆయన కే.జి.ఎఫ్ గురించి మాట్లాడుతూ, అసలు ఆ సినిమా రిలీజ్ కి ముందు హీరో ఎవరు అనేది కూడా తెలియదు మన జనాలకి, కానీ నిర్మాత మాత్రం కథని నమ్మి సినిమా కి ఖర్చు పెట్టాడు కట్ చేస్తే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి కూర్చుంది. దానికి తగట్టుగానే రెండో భాగానికి కూడా తగిన బడ్జెట్ ని పెట్టి అది హిట్ అయ్యేలా చేసారు. దిన్ని బట్టి చుస్తే సినిమా బడ్జెట్ పెరగడం అనే దాంట్లో హీరో లది ఎం లేదు అనేది అందరు గ్రహించాలి అని ఆయన పేర్కొన్నారు.

కాగా ఈ మాటలు అన్నీ అల్లు అరవింద్ నిన్న జరిగిన కోటబొమ్మాళి టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు.  సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో టీజర్‌‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్ర టీజర్‌‌ను రిలీజ్ చేశారు. అనంతరం అల్లు అరవింద్ పైన చెప్పిన విధంగా హీరోల రెమ్యునరేషన్ గురించి అలానే సినిమా బడ్జెట్ గురించి వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News