టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సినిమా ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన బన్నీ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న ఈ సినిమా ఓవర్సీస్లోనూ దుమ్మురేపుతోంది. ఇటీవల అమెరికాలో ఈ ఏడాది 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి భారత సినిమాగా నిలిచిన ‘అల వైకుంఠపురంలో’ తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
More power to the team @alluarjun gaaru & #Trivikram gaaru ♥️#AVPLSankranthiWinner 🏹#AlaVaikunthapurramuloo 🤩#godbless ✊ pic.twitter.com/umYvKcnHEM
— thaman S (@MusicThaman) January 21, 2020
అమెరికాలో బక్సాఫీస్ను షేక్ చేస్తున్న త్రివిక్రమ్-బన్నీ హ్యాట్రిక్ కాంబినేషన్ మూవీ అక్కడ 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. ఈ సినిమా యూఎస్ఏలోనూ బాక్సాఫీసు వద్ద ఇంకా సందడి చేస్తుంది. దీనిపై మూవీ యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మూడు మిలియన్ల మార్క్ ఫొటోను ట్వీట్ చేశారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌కు అభినందనలు తెలిపారు.
#USA Boxoffice... Total till 19 Jan 2020...
⭐️ #Darbar: $ 1,623,503 [₹ 11.53 cr]
⭐️ #Telugu film #SarileruNeekevvaru: $ 2,105,854 [₹ 14.96 cr]
⭐️ #Telugu film #AlaVaikunthapurramuloo: $ 2,838,694 [₹ 20.16 cr]@comScore— taran adarsh (@taran_adarsh) January 20, 2020
ఓవరాల్‌గా యూఎస్ఏలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా బాహుబలి 2. తర్వాత బహుబలి, రంగస్థలం, భరత్ అనే నేను ఉన్నాయి. బాహుబలి 2 అత్యధికంగా అక్కడ 21 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం. కాగా, అల వైకుంఠపురంలో సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..