Allu Arjun Fan: బన్నీని కలిసేందుకు ఓ అభిమాని పాదయాత్ర

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు( Allu Arjun ) జాతీయ స్థాయిలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. 

Updated: Sep 18, 2020, 03:14 PM IST
Allu Arjun Fan: బన్నీని కలిసేందుకు ఓ అభిమాని పాదయాత్ర
Pic courtesy: Twitter

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు( Allu Arjun ) జాతీయ స్థాయిలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తన నటనతో, డ్యాన్స్ తో, డైలాగ్ డిలవరీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అదే విధంగా తన అభిమానుల విషయంలో బన్నీ బిహేవియర్ కూడా చాలా మందికి నచ్చుతుంది.

Also Read: Pan India: ప్యాన్ ఇండియాపై ఫోకస్ పెట్టిన తెలుగు స్టార్స్, దర్శకనిర్మాతలు

ఒకనోక సందర్భంలో తన అభిమానిని సొంత సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా ఆపేస్తే.. సెక్యూరిటీ సిబ్బందికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అల్లు అర్జున్. తన ఫ్యాన్స్ ను కలవడానికి వచ్చే ప్రతీ అవకాశం సంతోషంగా స్వీకరిస్తాడు. అదే విధంగా తన ఫ్యాన్స్ తనతో కలవడానికి వస్తే వారిని స్మైల్ తో గ్రీట్ చేస్తాడు. టాలీవుడ్ లో ( Tollywood ) తో పాటు బాలీవుడ్ లో కూడా బన్నీకి అభిమానులు ఉన్నారు.

తాజాగా అల్లు అర్జున్ సినిమాలు, అతని వ్యక్తిత్వానికి ఫిదా అయిన ఒక ఫ్యాన్ బన్నీని కలవడానికి మాచర్ల నుంచి హైదరాబాద్ ( Hyderabad ) వరకు పాదయాత్ర చేపట్టాడు. గుంటూరులో ఉన్న మాచర్ల నుంచి హైదరాబాద్ కు సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత దూరం నుంచి పాదయాత్రకు బయల్దేరిన ఆ అభిమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media ) వైరల్ అవుతోంది. ఇందులో అతను ఎందుకు పాదయాత్ర చేపట్టాల్సి వచ్చింది కూడా తెలిపాడు. 

Also Read: WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే

తను అల్లు అర్జున్ వీరాభిమానిని అని తెలిపిన ఆ యువకుడు.. గతంలో హైదరాబాద్ కు పలు సార్లు వచ్చినా.. అల్లు అర్జున్ ను కలవడం సాధ్యం కాలేదు అన్నాడు. కొన్ని కారణాల వల్ల బన్నిని కలవలేకపోయినా అభిమాని ఈ సారి తప్పుకుండా స్టైలిష్ స్టార్ ను కలుస్తాను అని చెబుతున్నారు. మాచర్ల నుంచి పాదయాత్ర చేస్తూ వస్తున్న తనను సపోర్ట్ చేయాల్సిందిగా తోటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేశాడు.

అల్లు అర్జున్ ను కలవాలి అని పాదయాత్ర చేస్తున్న ఆ యువ అభిమాని కోరికను సోషల్ మీడియాలో నెటిజెన్స్ మద్దతు ఇస్తున్నారు. అతని వీడియోను బాగా షేర్ చేస్తున్నారు. దాంతో పాటు ఇలాంటి వీరాభిమాని కోరకను తీర్చమని.. అతన్ని కలిసే అవకాశం ఇవ్వమని కోరుతున్నారు. కాగా హైదరాబాద్ వచ్చాక అతన్ని కలుస్తాను అని బన్నీ తెలిపినట్టు సమాచారం. 

Also Read: NPS Alert: NPS ఖాతాదారులకు శుభవార్త.. ఇంట్లో కూర్చొనే నామినీ వివరాలు మార్చే సదుపాయం

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పా సినిమా చేస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ లుక్ తో పాటు పాత్ర అందరికి నచ్చతుంది అని టీమ్ అంటోంది. పుష్ప చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR