Allu Aravind - Sritej: నా కొడుకు బన్ని రాలేడు.. శ్రీతేజ్ కు అల్లు అరవింద్ పరామర్శ..

Allu Aravind - Sritej: ‘పుష్ప 2’ విడుదలకు ఒక రోజు ముందు సంధ్య థియేటర్ లో  జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ఆందోళనకంగా  ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ ఆ బాలుడిని ఇప్పటి వరకు పరామర్శించలేదు. ఈ నేపథ్యంలో బన్ని తండ్రి అల్లు అరవింద్ ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 18, 2024, 08:56 PM IST
Allu Aravind - Sritej: నా కొడుకు బన్ని రాలేడు.. శ్రీతేజ్ కు అల్లు అరవింద్ పరామర్శ..

Allu Aravind - Sritej: అవును పుష్ప 2 విడుదల సందర్భంగా  సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రేవతి అనే యువతి తొక్కిసలాటలో తన కుమారుడిని రక్షిస్తూ తను తనువు చాలించింది. అప్పటి నుంచి బాలుడు పరిస్థితి ఏమంత బాగాలేదు. ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ను A11గా చేర్చారు. అంతేకాదు బన్నిని అరెస్ట్ చేయడం... బెయిల్ రావడం అన్ని ఒక రోజు జైలులో ఉంచడం అన్ని సినీ ఫక్కీలో  అన్ని చకచకా జరిగిపోయాయి. మరోవైపు బన్ని ఇప్పటి వరకు శ్రీతేజ్ ను పరామర్శించక పోవడంపై విమర్శల వస్తున్నాయి. అయితే.. తెలంగాణ ప్రభుత్వమే అల్లు అర్జున్ హాస్పిటల్ కు రాకుండా ఆంక్షులు విధించినట్టు తెలుస్తోంది. అతను మరోసారి కిమ్స్ హాస్పిటల్ కు వస్తే.. మరోసారి పరిస్థితులు అదుపు తప్పుతాయనే ఉద్దేశ్యంతో అతన్ని పోలీసులు అనుమతించలేదు.   

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను కిమ్స్ హాస్పిటల్ లో  పరామర్శించారు ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ తండ్రి అయిన అల్లు అరవింద్. అంతేకాదు శ్రీతేజ్‌ యోగా క్షేమాలు అడిగి  తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన హస్పిటల్‌ వైద్యాధికారులతో, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ గారు మాట్లాడుతూ.. ఇప్పుడే హస్పిటల్‌లో చికిత్స పొందుతున్న  శ్రీతేజ్‌ను ఐసీయూలో చూశాను. డాక్టర్లందరితోనూ మాట్లాడాను. బాలుడు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.  రోజు రోజుకి రికవరీ అవుతున్నాడు. గత 14 రోజుల్లో.. లాస్ట్‌ 10 డేస్‌ల్లో బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడనుంది. పూర్తిగా‌ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. అయితే శ్రీతేజ్‌ కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము. దీంతో పాటు ప్రభుత్వం కూడా మేము కూడా శ్రీతేజ్‌ను సంపూర్ణ ఆరోగ్యంగా చూడటానికి రెడీగా ఉన్నామని  అని చెప్పడం  అభినందనీయమన్నారు.  చాలా మంది అభిమానులు, బందువులు, మిత్రులు అల్లు అర్జున్‌ ఎందుకు హస్పటల్‌కు వెళ్లలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం. తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఉదయమే అర్జున్‌ హస్పటల్‌కు వెళ్లదామనుకున్నాడు. కానీ హస్పటల్‌ అధికారులు నిన్నే కదా ఈ సంఘటన జరిగింది కదా.

మీరు హస్పటల్‌కు ఇపుడే రావద్దని చెప్పారు. మాకు అదే కరెక్ట్‌ అనిపించింది. అందుకే రాలేదు. ఇక ఆ రోజే అర్జున్‌పై కేసు వచ్చింది. ఆ కేసులో  లీగల్‌ టీమ్‌ హెడ్‌ నిరంజన్‌ రెడ్డి ఆసుపత్రికి వెళ్లకూడదు. వారిని కలవకూడదు అని ఆయన స్ట్రాంగ్‌గా చెప్పారు. ఆ తరువాత మేము రావడానికి ఎన్నో నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ రోజు బాధపడుతూ నేను చూడలేకపోయాను.. మీరైనా వెళ్లండి.. డాడీ అన్నాడు. అందుకే నేను ఇక్కడికి రావడానికి ముందు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకున్నాను. వాళ్ల పర్మిషన్ తో  ఈ రోజు వచ్చాను. ఈ  అనుమతి నాకు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పోలీస్‌ శాఖకి, హస్పిటల్‌ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసారు.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News