Pushpa 2: అఫీషియల్ అనౌన్స్మెంట్.. పుష్ప -2 రిలీజ్ డేట్ ఫిక్స్.!

Pushpa 2 new release date: అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. ఈ చిత్రం మొదటి పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ప్రస్తుతం ఈ చిత్రం రెండో భాగం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ముందుగా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాలవల్ల డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ పుష్ప రిలీజ్ డేట్ లో మార్పు రావడం గమనర్హం.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Oct 24, 2024, 03:00 PM IST
Pushpa 2: అఫీషియల్ అనౌన్స్మెంట్.. పుష్ప -2  రిలీజ్ డేట్  ఫిక్స్.!

Pushpa 2 release date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో  వస్తున్న చిత్రం పుష్ప - 2 . భారీ అంచనాల మధ్య అత్యధిక బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన విడుదల చేస్తామని గతంలో చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు ఈ డేట్ ను మారుస్తూ కొత్త డేట్ ఫిక్స్ చేశారు.. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 

ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఒకరోజు ముందుగానే సినిమా రాబోతుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. 

ఇందులో రష్మిక మందన్న హీరోయిన్  గా నటిస్తూ ఉండగా ప్రముఖ యాంకర్ అనసూయ, సునీల్ , ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు ఇందులో ఐటమ్ గర్ల్ గా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్నట్లు సమాచారం. కేవలం ఈ పాట కోసం శ్రద్ధ కపూర్ తీసుకుంటున్న రమ్యునరేషన్ కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్ద టాక్ కొనసాగుతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ప్రత్యేకత ఉంటుంది. ఇక పుష్ప  సినిమాలో సమంత తొలిసారి..ఐటం గర్ల్ గా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు రెండవ భాగంలో శ్రద్ధ కపూర్ కనిపించబోతోందని తెలియడంతో మరిన్ని అంచనాలు పెరిగావు. ఇకపోతే ఇటీవల శ్రద్ధా కపూర్ స్త్రీ -2..  సినిమాతో రూ.600 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 

కాగా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ , పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు సరికొత్త పోస్టర్ విడుదల చేస్తూ విడుదల తేదీని.. ప్రకటించారు అల్లు అర్జున్. ఈ పోస్టర్తో అల్లు అర్జున్ అభిమానులు పండగ జరుపుకుంటున్నారు. ఈ సినిమా మొదటి పాస్టర్ కన్నా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని.. అంతేకాకుండా అల్లు అర్జున్కి మరోసారి కూడా నేషనల్ అవ్వాలి రావడం ఖాయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also read: Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x