Allu Arjun Sandeep Reddy Vanga : కథే లేని దానికి ఇంత హడావిడా?.. సందీప్ వంగా బన్నీ ప్రాజెక్ట్ అసలు ఉంటుందా?

Allu Arjun Sandeep Reddy Vanga Project అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్లో దుమ్ములేపేస్తోన్నాడు. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌ను కాపాడుకునేందుకు బన్నీ బాగానే ప్రయత్నిస్తున్నాడు. అందుకే బన్నీ ఇప్పుడు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 03:52 PM IST
  • అల్లు అర్జున్ కొత్త సినిమా
  • లైన్‌లోకి వచ్చిన సందీప్ రెడ్డి వంగా
  • కథే ఇంకా ఫిక్స్ కాలేదా?
Allu Arjun Sandeep Reddy Vanga : కథే లేని దానికి ఇంత హడావిడా?.. సందీప్ వంగా బన్నీ ప్రాజెక్ట్ అసలు ఉంటుందా?

Allu Arjun Upcoming Movies అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. పుష్ప ది రైజ్ అనుకోకుండా పాన్ ఇండియన్ హిట్ అవ్వడంతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. దానికి తగ్గట్టుగా పుష్ప ది రూల్ సినిమాను సుకుమార్ చెక్కాడు. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. బన్నీ ఇప్పుడు తన దృష్టి అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ బడా సంస్థలతో సినిమాలు తీసేయాలని అనుకుంటూ ఉన్నాడేమో. అందుకే టీ సిరిస్ సంస్థలో బన్నీ తన సినిమాను ప్రకటించాడు.

టీ సిరీస్‌లో ఇప్పుడు సందీప్ రెడ్డి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కబీర్ సింగ్, యానిమల్, స్పిరిట్ అంటూ ఆ సంస్థలోనే సందీప్ రెడ్డి సినిమాలు చేస్తున్నాడు. అయితే సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. అర్జున్ రెడ్డికి రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్ నార్త్ ఆడియన్స్‌ను సైతం అట్రాక్ట్ చేసింది. అయితే యానిమల్ సినిమా సంగతి ఏంటో తెలియదు. తరువాత ప్రభాస్‌తో చేసే చిత్రానికి సంబంధించిన కథ ఏంటో కూడా తెలియడం లేదు.

ఇప్పుడు బన్నీతో చేసే సినిమాకు అసలు కథ కూడా ఇంకా ఫిక్స్ కాలేదట. ఏదో కాంబినేషన్‌ కోసం హడావిడిగా ప్రకటించేశారంటూ కథనాలు వస్తున్నాయి. అసలు ఈ సినిమా ఉంటుందా? లేదా? అన్నది కూడా చెప్పలేమని అంటున్నారు. బన్నీకి ఇలా సినిమాలు ప్రకటించి ఆపేయడం అలవాటే అని అంటున్నారు.

గతంలో వేణు శ్రీరామ్‌తో కలిసి ఐకాన్ సినిమాను ప్రకటించారు. కానీ అది అటకెక్కేసింది. కొరటాల శివతోనూ బన్నీ సినిమా ఉంటుందని అన్నారు. మురుగదాస్‌తోనూ బన్నీ మూవీ ఉంటుందని అన్నారు. కానీ అవేవీ కూడా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. సందీప్ రెడ్డి వంగా యానిమల్, స్పిరిట్ సినిమాలు హిట్ అయితే బన్నీ చాన్స్ ఇస్తాడని లేదంటే అది కూడా పక్కకు పోతుందని అంతా అనుకుంటున్నారు.

మరి బన్నీ నెక్ట్స్ సినిమా మీద మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. బన్నీ ఇప్పుడు పుష్ప రెండో పార్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ ఏడాదిలోనే అది అవుతుంది. అయితే నెక్ట్స్ చేయబోయే సినిమా ఏంటన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. మధ్యలో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని కూడా అన్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

Also Read:  Priyadarshi Balagam : బలగం ఆమెకే అంకితం.. అమ్మ కాదు అత్తమ్మ.. ప్రియదర్శి ఎమోషనల్ పోస్ట్

Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News