Chiranjeevi:పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో  కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 22, 2024, 07:48 AM IST
Chiranjeevi:పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు ఆయనకు వేదాశ్వరచనంతో పాటు తీర్థ ప్రసాదాలు, స్వామి శేష వస్త్రం అందజేసారు. చిరంజీవి, సురేఖతో పాటు చిరంజీవి అమ్మగారైన అంజనా దేవి గారు, మరియు చిన్న కూతురు శ్రీజ వాళ్ల పిల్లలు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

మరోవైపు చిరంజీవి తన కొత్త సినిమాకు సంబంధించిన ఏదైనా అనౌన్స్ మెంట్ చేస్తారా లేదా అనేది చూడాలి. మరోవైపు చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆయన నటించిన ఓల్డ్ క్లాసిక్  మూవీస్ ‘ఇంద్ర’, శంకర్ దాదా MBBS చిత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ ఇయర్ చిరంజీవికి ప్రత్యేకం అని చెప్పాలి. తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ అందుకున్నారు. అంతేకాదు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్  ఎన్నికల్లో కూటమిగా ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించడంతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. ఒక రకంగా ఈ పుట్టినరోజు చిరంజీవికి వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News