Pushpa trailer: Allu Arjun స్టామినా ఏంటో చెప్పేలా పుష్ప ట్రైలర్.. తగ్గేదేలె

అల్లు అర్జున్ స్టామినా ఏంటే చెప్పేలా ఉన్న పుష్ప మూవీ ట్రైలర్ చూస్తుంటే.. అల్లు అర్జున్ అభిమానులకు (Allu Arjun's fans) మన హీరో తగ్గేదేలే అనిపించడం ఖాయం అనేలా ఉంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. పుష్ప: ది రైజ్ ట్రైలర్‌పై (Pushpa trailer Telugu) మీరూ ఓ లుక్కేయండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 10:03 PM IST
Pushpa trailer: Allu Arjun స్టామినా ఏంటో చెప్పేలా పుష్ప ట్రైలర్.. తగ్గేదేలె

Pushpa Trailer Telugu : అల్లు అర్జున్ అప్‌కమింగ్ సినిమా పుష్ప మూవీ ట్రైలర్ వచ్చేసింది. అల్లు అర్జున్ అంటేనే ఫ్యాషన్‌కి పెట్టింది పేరు. అందుకే ఆయన సౌతిండియాకే స్టైలిష్ స్టార్ అయ్యాడు. అలాంటి స్టైలిష్ స్టార్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్‌ని తొలిసారిగా, మునుపెన్నడూ చూడని విధంగా రఫ్ అండ్ మాస్ అవతార్‌లో చూపిస్తూ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే తగ్గేదేలే అంటూ తాజాగా పుష్ప ట్రైలర్ రిలీజైంది. పుష్ప.. పుష్ప రాజ్, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. తగ్గేదెలే వంటి డైలాగ్స్ అల్లు అర్జున్ అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి.

అల్లు అర్జున్ స్టామినా ఏంటే చెప్పేలా ఉన్న పుష్ప మూవీ ట్రైలర్ చూస్తుంటే.. అల్లు అర్జున్ అభిమానులకు (Allu Arjun's fans) మన హీరో తగ్గేదేలే అనిపించడం ఖాయం అనేలా ఉంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. పుష్ప: ది రైజ్ ట్రైలర్‌పై (Pushpa trailer Telugu) మీరూ ఓ లుక్కేయండి.

Also read : Unstoppable latest episode: విలన్‌గా చేయడానికి నేను రెడీ.. బట్ వన్ కండిషన్ అంటున్న NBK

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన రష్మిక మంధన జంటగా నటించిన పుష్ప మూవీలో మళయాళం నటుడు ఫహద్ ఫాజిల్ మరో కీలక పాత్ర పోషించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మళయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హిందీలో గోల్డ్ మైన్స్ టెలి ఫిలింస్, తమిళంలో లైకా ప్రొడక్షన్స్, మళయాళంలో ఇఫర్ఎంటర్‌టైన్మెంట్‌ఫర్ఇ, కన్నడలో అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానెల్స్‌లో ఆయా భాషల్లో పుష్ప ట్రైలర్స్ (Pushpa trailer latest updates) లాంచ్ కానున్నాయి.

Also read : RRR Ramcharan Poster: రోరింగ్ రాంచరణ్... ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయిన కొత్త పోస్టర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News