Actress Amala Paul hides her beauty behind the leaves: 1991 అక్టోబరు 26న అమలా పాల్ జన్మించారు. కేరళలోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. అమలా పాల్ అసలు పేరు అనఖ.
విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తిచేసిన అమలా పాల్.. ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తెరకెక్కించిన 'నీల తామర' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు.
తమిళ హాస్యచిత్రం 'వికడకవి'లో ఒక పాత్రను పోషించినా.. ఈ సినిమా విడుదల బాగా ఆలస్యం అయింది. ఈ మధ్యలో వీర శేకరన్, సింధు సామవేళి అనే తమిళ చిత్రాలలో నటించారు. సింధు సామవేళిలో అమల పోషించిన సుందరి పాత్రతో బాగా ఫేమస్ అయ్యారు.
'మైనా' (తెలుగులో ప్రేమ ఖైదీ) చిత్రం ఘన విజయం సాధించడంతో.. అమలా పాల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక 'నాయక్' సినిమాతో ఆమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
తెలుగులో ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, మేము, ఆమె సినిమాలతో అమలా పాల్ సత్తాచాటారు. రఘువరన్ బీటెక్, వీఐపీ వంటి తమిళ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అలరించారు.
అందం, అభినయం ఉన్నా అమలా పాల్‌కు తెలుగులో అవకాశాలు అయితే రాలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మ తమిళ, మళయాల ఇండస్ట్రీలకు వెళ్లిపోయారు. అటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్నారు.
అమలా పాల్ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు. తాజాగా అమలా ఆకుల చాటున తన అందాలు దాచి ఉంచారు.
Also Read: సూర్యకుమార్ లాంటి బ్యాటర్‌ను ఎప్పుడూ చూడలేదు.. సైలెంట్‌గా పని ముగిస్తాడు: డుప్లెసిస్
Also Read: Fake Fielding: కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వల్లే మేం ఓడిపోయాం.. బంగ్లాదేశ్ ప్లేయర్ ఆరోపణలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook