Acharya: టైటిలే కరెక్ట్ కాదు.. ఆయనతో ఐటెం సాంగా? ఆచార్యపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు!

Paruchuri Gopalakrishna: మెగాస్టార్ చిరంజీవి,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్యపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరుచూరి గోపాలకృష్ణ ఆచార్యపై తన అభిప్రాయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 10:25 AM IST
  • టైటిలే కరెక్ట్ కాదు.. ఆయనతో ఐటం సాంగా?
  • ఆచార్యపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు!
  • వీడియో విడుదల చేసిన పరుచూరి
 Acharya: టైటిలే కరెక్ట్ కాదు.. ఆయనతో ఐటెం సాంగా? ఆచార్యపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు!

Parachuri Gopalakrishna Interesting Comments on Acharya: మెగాస్టార్ చిరంజీవి,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. సినిమా కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే కనీసం అభిమానులను కూడా సినిమా ఆకట్టుకోలేదు అంటే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే మెగాస్టార్ సినీ కెరియర్లోనే కాక తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్న విధంగా ఈ సినిమా డిజాస్టర్ కావడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కారణాల మీద సీనియర్ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నారు. 

ఈ సినిమాను తాము గతంలో చేసిన మరో మలుపు అనే సినిమాతో పోల్చిన ఆయన ఆ సినిమాలో కూడా ఇదే విధమైన కథ,  కథనం ఉన్నాయని గుర్తు చేశారు. అయితే ఆ సినిమా హిట్ అయిందని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో ఎర్ర సినిమాలు రావడం లేదని పేర్కొన్న పరుచూరి గోపాలకృష్ణ ఈ సమయంలో ఒక ఎర్ర సినిమా తీయాలని కొరటాల లైన్ చెప్పడం దానికి చిరంజీవి అంగీకారం తెలపడంతో ఆచార్య రూపుదిద్దుకుందని చెప్పుకొచ్చారు.  సినిమాగా చూస్తే ఆచార్యలో ఎలాంటి తప్పులు లేవు కానీ అసలు ముఖ్యమైన సంఘటన ఏంటి? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది అనే విషయాలు చెప్పకుండా కథ నడిపిన తీరు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. 

సెంటిమెంట్,  సస్పెన్స్ ఒకే ఒరలో ఇమడవు అని పేర్కొన్న ఆయన డైలాగ్స్,  కథాంశం,  నటీనటుల పర్ఫామెన్స్ లాంటివి బాగున్నా సరే ఈ రోజుల్లో కమ్యూనిజం భావజాలం ఉన్న సినిమాలు యూత్ కి నచ్చడం లేదని అభిప్రాయపడ్డారు. రామ్ చరణ్ తో సిద్ధ పాత్ర చేయించకుండా ఉంటే బాగుండేదని పేర్కొన్న ఆయన ఒక వేళ ఆయనను పెట్టాల్సి వచ్చినా ఫ్లాష్ బ్యాక్ లో కేవలం 10 శాతానికి రామ్ చరణ్ పాత్రను పరిమితం చేసి 90 శాతం చిరంజీవికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే రిజల్ట్ మరోలా ఉండి ఉండేదని అభిప్రాయపడ్డారు. 

మణిశర్మ అందించిన సంగీతం కూడా సరిగ్గా కుదరలేదని దానికి తోడు కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఆచార్య పాత్రలో మెగాస్టార్ ఒక ఐటెం సాంగ్ కి స్టెప్పులు వేయకుండా ఉండాల్సిందని అన్నారు. అసలు ఆచార్య టైటిల్ కూడా పెట్టడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక 16 నిమిషాల వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ సినిమాకి సంబంధించి అనేక విషయాలను టచ్ చేసి తన అభిప్రాయాలను కూలంకషంగా వెల్లడించారు. ఇక ప్రస్తుతం పరుచూరి గోపాలకృష్ణ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతుంది.

Also Read: Anchor Shiva: రాశిఖన్నాతో పులిహోర.. ఏకంగా పెళ్లికి టెండర్ పెట్టాడుగా!

Also Read: Samantha Ruth Prabhu: దాంపత్య జీవితం గురించి ఓపెనయిన సమంత… అంతా కరణ్ జోహారే చేశాడట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News