Anchor Suma Funny Reel: తలపై తడిగుడ్డేసుకున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్

Anchor Suma Funny Video: యాంకర్ సుమ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అసలే సుమ బుల్లితెరపై ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తోంది. బుల్లితెర, సినిమా ఈవెంట్లలో అల్లరి చేస్తుంటుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అందరినీ ఆకట్టుకుంటోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2023, 10:11 AM IST
  • నెట్టింట్లో యాంకర్ సుమ సందడి
  • ఇన్ స్టాగ్రాంలో సుమ రీల్ వీడియోలు
  • ఫన్నీ వీడియోపై నెటిజన్ల కామెంట్లు
Anchor Suma Funny Reel: తలపై తడిగుడ్డేసుకున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్

Anchor Suma Viral Video: యాంకర్ సుమ సోషల్ మీడియాలో తన అభిమానులు, ఫాలోవర్లను ఎంతలా ఎంటర్టైన్ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్ చానెల్, ఇన్ స్టాగ్రాం ద్వారా ఆమె బాగానే సంపాదించేస్తోంది. యూట్యూబ్ చానెల్‌ను మరింతగా ప్రమోట్ చేసే క్రమంలో రకరకాల వీడియోలు చేస్తూ వచ్చింది. ఇక ఇన్ స్టాలో అయితే ఫన్నీ రీల్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫన్నీ రీల్ వీడియో అందరినీ నవ్వించేస్తోంది.

యాంకర్ సుమ కామెడీ టైమింగ్, ఆమె యాక్టింగ్ స్కిల్స్ గురించి అందరికీ తెలిసిందే. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా కూడా సుమ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఆమె ఫన్నీ రీల్ వీడియోలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా యూట్యూబ్ వీడియోలు చేస్తుంటుంది. ఎక్కువగా వంటలు, సెలెబ్రిటీల పర్సనల్‌ విషయాలను రాబట్టే వీడియోలను చేస్తుంటుంది.

సుమ తన వీడియోల్లో తన స్టాఫ్‌ను కూడా ఇన్వాల్వ్ చేస్తుంటుంది. సుమ ఎక్కువగా తన టీంతోనే రీల్ వీడియోలు చేస్తుంటుంది. ఇక సుమ తన పని మనిషిని ఎలా ఆడుకుంటుంది.. ఎలా కౌంటర్లు వేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. సుమ తాజాగా చేసిన రీల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

మామూలుగా సండే ఎంజాయ్ చేశాక.. మండే ఆఫీస్‌కు వెళ్లడం, పని చేయడం అంటే కొందరికి బద్దకంగా చిరాగ్గా ఉంటుంది.. సోమవారం కాస్త కష్టంగా మొదలవుతుంది.. ఇదే విషయాన్ని చెప్పేందుకు సుమ ఫన్నీ రీల్ వీడియో చేసింది. చిన్న పిల్లలా మారాం చేసింది. మండే ఆఫీస్‌కు వెళ్లడం ఇష్టం లేదని చెప్పేందుకు సుమ చేసిన ఈ వీడియో, అందులో గుడ్డను నెత్తిన వేసుకోవడం, చిన్న పిల్లలా మారాం చేయడంపై నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు. భలే నవ్విస్తున్నారు.. మీ కామెడీ టైమింగ్ బాగుంది.. తెగ నవ్వించేస్తున్నారు.. మా ఫీలింగ్ కూడా అదే అంటూ ఇలా కామెంట్లు పెట్టేస్తున్నారు.

 Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News