Nani-Nazriya Nazim: నాని, న‌జ్రియా ఫ‌న్నీ ఛాలెంజ్.. వీడియో చూస్తే నవ్వులే!

Nani-Nazriya Nazim This or That challenge. 'అంటే సుందరానికి' సినిమా సీన్ల‌కు అనుబంధంగా సాగే ‘This or That’ ఛాలెంజ్‌తో నాని, న‌జ్రియా నజిమ్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 06:28 PM IST
  • నాని-న‌జ్రియా ఫ‌న్నీ ఛాలెంజ్
  • నాని-న‌జ్రియా వీడియో చూస్తే నవ్వులే
  • పానీపూరి-సమోసా రాగానే
Nani-Nazriya Nazim: నాని, న‌జ్రియా ఫ‌న్నీ ఛాలెంజ్.. వీడియో చూస్తే నవ్వులే!

Nani-Nazriya Nazim This or That challenge for Ante Sundaraniki Promotions: నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'అంటే సుందరానికి'. యువ డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'అంటే సుందరానికి' సినిమా.. జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు మొదలెట్టింది చిత్ర యూనిట్. 

'అంటే సుందరానికి' సినిమాను చిత్ర యూనిట్ సరికొత్త‌గా ప్ర‌మోట్ చేస్తోంది. తాజాగా సినిమా సీన్ల‌కు అనుబంధంగా సాగే ‘This or That’ ఛాలెంజ్‌తో నాని, న‌జ్రియా నజిమ్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. వీడియోలో ఇద్దరిముందు స్క్రీన్ మీద కేట‌గిరీలు వస్తుంటే.. నచ్చిన వైపు వెళ్లడమే ఈ షో. ముందుగా నాన్ వెజ్-వెజ్ కేట‌గిరీలు రాగా.. న‌జ్రియా, నాని ఇద్దరూ నాన్‌వెజ్ వైపు వెళతారు. ఆ త‌ర్వాత ఎంత చిత్రం పాట, పంచెక‌ట్టు పాట రాగా.. ఇద్ద‌రూ ఎంత చిత్రం సాంగ్ వైపు వెళ్తారు. సైన్స్-మ్యాథ్స్ రాగానే న‌జ్రియా నేను స్ట్రెయిట్‌గా వెళ్లొచ్చా అని.. నానితో క‌లిసి సైన్స్ వైపు వెళతారు.

మెలోడీ సాంగ్స్-మాస్ సాంగ్స్ రాగానే.. న‌జ్రియా మాస్ సాంగ్స్ వైపు, నాని మెలోడీ సాంగ్స్ వెళతాడు. పానీపూరి-సమోసా రాగానే పానీపూరి వైపు నాని, సమోసా వైపు న‌జ్రియా వెళతారు. ఆవకాయ-వైన్ రాగానే.. ఇద్దరూ కలిసి వైన్ వైపు దూసుకెళతారు. వివేక్ సాగర్-వివేక్ ఆత్రేయ రాగా..  ఆత్రేయ వైపు న‌జ్రియా, సాగర్ వైపు నాని వెళతారు. దాంతో వీడియో ముగుస్తుంది. సినిమాలో ఇద్ద‌రి మ‌ధ్య కామెడీ ట్రాక్ ఎలా ఉండబోతుంద‌ని తాజా వీడియోతో చెప్పేశారు. ఈ ఛాలెంజ్‌ వీడియోను మైత్రీ మూవీ మేక‌ర్స్ అఫీషియ‌ల్‌ ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. 

'అంటే సుందరానికి' చిత్రంతో మ‌ల‌యాళీ భామ న‌జ్రియా న‌జీమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. న‌జ్రియా తెలుగులో ఇప్పటివరకూ ఒక్క సినిమా చేయకున్నా.. 'రాజా రాణి' సినిమాతో అందిరిని ఆకట్టుకున్నారు. మరోవైపు నాని వరుస సినిమాలను లైన్లో పెట్టారు. నూతన ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ష‌న్‌లో 'ద‌స‌రా' సినిమా చేస్తున్నాడు. గోదావరి ఖ‌నిలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల ప‌రిస‌ర ప్రాంతాల్లోని విలేజ్‌బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Also Read: MS Dhoni Retire: ఐపీఎల్ 2022 తర్వాత ఎంఎస్ ధోనీ రిటైర్ అవుతాడా?.. సునీల్ గవాస్కర్ ఏం చెప్పారంటే?

Also Read: Sunny Leone Birthday: సన్నీ లియోనీ బర్త్ డే స్పెషల్.. సన్నీ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News