Nazriya First look: నాని 'అంటే సుందరానికి!' సినిమాలో నజ్రియా లుక్ ఇదే..!

Ante Sundaraniki Nazriya First look:  హీరో నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికి!'. తాజాగా నజ్రియా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 06:44 PM IST
Nazriya First look: నాని 'అంటే సుందరానికి!' సినిమాలో నజ్రియా లుక్ ఇదే..!

'Ante Sundaraniki' Nazriya First look:  మలయాళ నటి నజ్రియా నజీమ్ త్వరలో 'అంటే సుందరానికి!' (Ante Sundaraniki) అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇందులో నేచురల్ స్టార్ నానికి (Hero Nani) జోడిగా నటిస్తోంది. ఈ సినిమా అవుట్-అండ్-అవుట్ కామెడీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.  వివేక్ సాగర్  సంగీతమందిస్తున్న ఈ మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, సుహాస్, నదియా, రాహుల్ రామకృష్ణ, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, మరియు పృధ్వీ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నజ్రియా...లీలా థామస్ (Leela Thomas) అనే పాత్రలో నటించనుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆమె ఆమె నీలిరంగు చొక్కా  ధరించి, డెనిమ్ జీన్స్ ధరించి కెమెరాతో పోజులిచ్చింది. దీనితో పాటు 'ప్రేయర్ ఆఫ్ లీలా' పేరుతో  ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. కుటుంబం కారణంగా ఇబ్బందుల్లో పడే అమాయక బ్రాహ్మణుడిగా నాని కనిపించనున్నాడు. 

ఇదిలా ఉంటే, నాని శ్రీకాంత్ ఓదెలాతో కలిసి 'దసరా 'అనే సినిమా చేస్తున్నాడు.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ (Keerthy suresh) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక ఇటీవల జరిగింది. 

Also Read: RRR Movie Pre-Release Event: హైదరాబాద్ టు దుబాయ్.. భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News