OMG Songs : పైసా రే పైసా అంటూ అనూప్ రూబెన్స్ సందడి

O Manchi Ghost Paisa Re Paisa అనూప్ రూబెన్స్ ఇప్పుడు చిన్న సినిమాలతోనే బిజీగా ఉంటున్నాడు. చివరగా బంగార్రాజు అనే సినిమా తన పాటలతో ఊపేశాడు అనూప్ రూబెన్స్. ఇప్పుడు ఎక్కువగా చిన్న సినిమాలకు మ్యూజిక్ కొడుతున్నాడు అనూప్.

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2023, 03:45 PM IST
  • ఓ మంచి ఘోస్ట్ పాటల సందడి
  • పైసా రే పైసా అంటూ మేకర్ల రచ్చ
  • అనూప్ పాటకు మంచి రెస్పాన్స్
OMG Songs : పైసా రే పైసా అంటూ అనూప్ రూబెన్స్ సందడి

O Manchi Ghost Paisa Re Paisa డబ్బు ప్రాధాన్యం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డబ్బు లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదు. ప్రపంచాన్ని నడిపిస్తుంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కాదు డబ్బు.  ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్షరాల డబ్బు మాత్రమే అనే  పాయింట్‌తో ఇప్పుడు ఓ సాంగ్ వచ్చింది. ఓ మంచి ఘోస్ట్ (OMG) అనే సినిమా నుంచి విడుదలైన పైసా రే పైసా అంటూ సాగే ఈ పాట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఓ మంచి ఘోస్ట్ సినిమాలో  డబ్బు ప్రాముఖ్యతపై అద్భుతమైన, అంతే చమత్కారమైన పాటను రాసి పాడి అందరినీ అలరిస్తున్నాడు అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్‌తో పాటు శ్రీనివాస్ చింతల ఈ పాటను రచించాడు. మంచి బీట్‌తో ఉన్న ఈ సాంగ్‌కు బాబా భాస్కర్ కొరియోగ్రాఫీ మరింతగా కలిసి వచ్చింది. డబ్బు మన జీవితంలో ఎలాంటి పాత్ర  పోషిస్తుందో చెప్పే ఈ పాట నెట్టింట్లో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News