Ap High Court- Bigg Boss : బిగ్ బాస్ షోను స్వయంగా చూస్తాం.. పూర్తి వివరాలు ఇవ్వండని కోరిన హైకోర్టు

Ap High Court ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో మీద పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అశ్లీలత మితి మీరిందని, షోను బ్యాన్ చేయాలంటూ గత వారం బిగ్ బాస్ మీద పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2022, 11:07 AM IST
  • బిగ్ బాస్ షో మీద పిటీషన్
  • స్వయంగా చూస్తామన్న హై కోర్టు
  • పూర్తి వివరాలు ఇవ్వండని కోరిన కోర్టు
Ap High Court- Bigg Boss : బిగ్ బాస్ షోను స్వయంగా చూస్తాం.. పూర్తి వివరాలు ఇవ్వండని కోరిన హైకోర్టు

Ap High Court- Bigg Boss : బిగ్ బాస్ షో మీద జరిగే చర్చ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. కొంత మంది బిగ్ బాస్ షో గురించి పాజిటివ్ కామెంట్లు చేస్తుంటారు. ఇంకొంత మంది బిగ్ బాస్ షోను దారుణంగా తిడుతుంటారు. బిగ్ బాస్ షోను జీవితంలో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఎంతో మంది అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రం బిగ్ బాస్ షోను దారుణంగా తిడుతుంటారు. సభ్యసమాజానికి ఏం మెసెజ్ ఇస్తున్నారు.. వ్యభిచార కొంప.. అశ్లీలతకు అడ్డా అంటూ ఇలా నానా రకాలుగా తిట్టిపోస్తుంటారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా కూడా బిగ్ బాస్ షో క్రేజ్ మాత్రం తగ్గదు.

ప్రస్తుతం బిగ్ బాస్ ఆరో సీజన్ మీద జరుగుతున్న చర్చ అందరికీ తెలిసిందే. గత వారంలో కేతిరెడ్డి జగదీష్ రెడ్డి అనే వ్యక్తి బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని ఏపీ హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ హైకోర్టు ఈ విషయం మీద స్పందించింది.  ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు ఒకట్రెండు ఎపిసోడ్లను చూస్తామని హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

ఈ కార్యక్రమాన్ని సెన్సార్‌ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని.. షోలో పాల్గొనే మహిళలకు గర్భధారణ పరీక్షలు చేస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారం ఇలాంటి వాటిని రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలన్నారు. కానీ విరుద్దంగా రాత్రి 9 నుంచి ప్రసారం చేస్తున్నారని.. సెన్సార్‌ బోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేతిరెడ్డి తన వాదనను వినిపించారని తెలుస్తోంది.
  
అయితే ఈ కేసును పరిష్కరించడానికి ముందు తాము బిగ్‌ బాస్‌ను చూస్తామని ధర్మాసనం చెప్పింది. అప్పుడే తమకు అప్పుడు కొంత అవగాహన వస్తుందని అభిప్రాయపడింది. తాము ప్రచారం కోసం పిల్‌ వేయలేదని.. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం నోటీసులు ఇవ్వలేమన్న ధర్మాసనం.. ఈ షోపై వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

మరి వీటివల్ల బిగ్ బాస్ షో మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? లేదా? అన్నది చూడాలి. అయితే జనాలు మాత్రం ఈ పిటీషన్, విచారణ వీటి మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనిపించడం లేదు. ఎవరేం చేసినా కూడా బిగ్ బాస్ షో నడుస్తూనే ఉంటుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :  RC 15 : దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్

Also Read : Nagarjuna Lakshmi Daggubati Wedding : రేర్ పిక్.. నాగార్జున-లక్ష్మీ దగ్గుబాటి పెళ్లి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News