Aravind Swamy in NBK 108: బాలకృష్ణ సినిమాలో అరవింద్ స్వామి.. షాకింగ్ పాత్రలో?

Aravind Swamy to Act in Balakrishna Anil Ravipudi Movie: అరవింద్ స్వామి నందమూరి బాలకృష్ణ -అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 5, 2022, 02:58 PM IST
Aravind Swamy in NBK 108: బాలకృష్ణ సినిమాలో అరవింద్ స్వామి.. షాకింగ్ పాత్రలో?

Aravind Swamy to Act in Balakrishna Anil Ravipudi Movie: బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాను ఒక రేంజ్ లో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమాలో హ్యాపెనింగ్ హీరోయిన్ ఎంపిక చేయగా ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన అరవింద స్వామిని తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి అరవిందస్వామి చేసిన అన్ని సినిమాలను తెలుగు వారు బాగానే ఆదరించారు.

అప్పుడెప్పుడో విడుదలైన రోజా నుంచి ఇటీవల విడుదలైన ధ్రువ సినిమా వరకు తెలుగులో అరవిందస్వామి నటించిన అన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. బాలకృష్ణ 108వ సినిమాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించే సినిమాలో కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి సంప్రదింపులు జరుగుతున్నాయని డేట్స్ విషయంలో ఇబ్బందులు లేకపోతే కనుక సినిమా చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అనిల్ రావిపూడికి అరవింద్ స్వామి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మరోపక్క బాలకృష్ణ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే దానికి గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో 107వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తుండగా ఒక కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఆమె కూడా నెగిటివ్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఆ విషయం మీద మాత్రం అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అరవింద్ స్వామి గనుక ఒప్పుకుంటే ఆయనకు తగినట్లుగానే పాత్ర తీర్చిదిద్దడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆయన ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అలాగే క్యాస్ట్ ఫైనల్ చేసే విషయంలో బిజీబిజీగా గడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: Rakul Preet Singh Pics: రకుల్ ప్రీత్ సింగ్ అందాల విందు.. బ్లాక్ లెహంగాలో అలా మెరిసిందిగా!

Also Read: NTR 30 Update: ఎన్టీఆర్ 30 షూట్ డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచే మొదలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News