అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఆయనేనా ?

అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌ ఎవరు ?

Last Updated : Sep 29, 2018, 07:13 PM IST
అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఆయనేనా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న అభిమానుల ముందుకు రానుండగా అంతకన్నా ముందుగా అక్టోబర్ 2న ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేట్ చేయడానికి ఆ చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నటించిన అనేక చిత్రాల ఆడియో ఫంక్షన్స్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి నందమూరి హరికృష్ణ అతిథిగా హాజరవుతుండే వారు. అయితే, ఈసారి దురదృష్టవశాత్తుగా ఆయన మన మధ్యలో లేకపోవడంతో అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ఎవరొస్తున్నారనే టాక్ వినిపించింది. అదే సందర్భంలో ఈ వేడుకకు బాలయ్య బాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారనే టాక్ కూడా వినిపించింది. అయితే, ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ముందస్తుగానే చెబుతూ ఎన్టీఆర్ అభిమానులకు అప్‌డేట్స్ ఇస్తోన్న ఆ చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈసారి మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు పెదవి విప్పడం లేదు. దీంతో అసలు ఈ సినిమా ఫంక్షన్‌కు బాలయ్య బాబు వస్తున్నాడా లేదా అనే సందేహం ఇంకా అలాగే కొనసాగుతోంది.

ఇంకొక మాట ఏంటంటే.. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు కేవలం అరవింద సమేత సినిమా యూనిట్ సభ్యులు మాత్రమే హాజరవుతారని, ఎప్పటిలాగే అన్నయ్య కల్యాణ్ రామ్ తమ్ముడి సినిమా ఫంక్షన్‌కి అతిథిగా హాజరవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా వేడుక కోసం వేచిచూస్తున్న అభిమానులు ఇంకా కొనసాగుతున్న ఈ సస్పెన్స్‌ని తట్టుకోలేకపోతున్నారు. ఈ ఒక్క విషయంపై ఇవాళో లేక రేపో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే మరి!

Trending News