Arya 3 : ఆర్య 3లో హీరో బన్నీ కాదట..మరి ఎవరంటే..!

Arya 3 : సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఆర్య సిరీస్ ఎంతో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆర్య3 సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడట డైరెక్టర్ సుకుమార్. కానీ ఈ సినిమాలో హీరో బన్నీ కాదట..మరి ఎవరంటే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2021, 07:03 PM IST
Arya 3 : ఆర్య 3లో హీరో బన్నీ కాదట..మరి ఎవరంటే..!

Arya 3 : క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఆర్య, ఆర్య2 చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ  చిత్రాలు బన్నీ(Allu Arjun) కెరీర్ నే మార్చేశాయి. బన్నీకి స్టైలిష్ స్టార్ అన్న పేరు రావ‌డానికి కార‌ణం `ఆర్య` సిరీస్ అనడంలో సందేహం లేదు. త్వరలోనే ఆర్య3తో పట్టాలెక్కనున్నట్లు సుకుమార్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

దీంతో  అల్లు అర్జున్(Allu Arjun) మరో క్రేజీ సీక్వెల్ కు డేట్స్ కేటాయించాడని ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేశారు. కాని సుకుమార్(Director Sukumar), బన్ని ప్లానింగ్ వేరే ఉంది. ఆర్య3లో అల్లు అర్జున్ స్థానంలో మరో హీరోని ఎంపిక చేయనున్నారట. ఈసారి ఆర్య పాత్రలో అర్జున్ రెడ్డి(Vijay Devarakonda)ని చూపిస్తాడట. అందుకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Also read: Akash Puri’s Romantic: 'రొమాంటిక్' ట్రైలర్...మామూలుగా లేదుగా..!

విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే ఓ మూవీ లాక్ అయింది. ఆ మూవీనే ఆర్య 3(Arya 3) అని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం లైగర్ షూటింగ్ లో దేవరకొండ, పుష్ప  షూట్‌లో సుకుమార్ బిజీగా ఉన్నారు.ఈ సినిమాలు పూర్తైన తర్వాత ఆర్య3పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News