Kalki 2898 AD: కల్కి టికెట్ రేట్స్ భారీగా పెరగనున్నాయా? అందరి చూపు ఆ సినిమా వైపు!

Kalki Update: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వల్ల ముందుగా ఏదన్న చిత్ర రిలీజ్ డేట్.. ప్రభావితం అయింది అంటే.. అది కల్కి2898AD సినిమా అనే చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికల తరువాత ఈ చిత్ర టికెట్ రేట్స్ చర్చకు దారి తీస్తున్నాయి..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 5, 2024, 03:27 PM IST
Kalki 2898 AD: కల్కి టికెట్ రేట్స్ భారీగా పెరగనున్నాయా? అందరి చూపు ఆ సినిమా వైపు!

Kalki Trailer: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా కల్కి2898AD. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు ప్రముఖ నిర్మాత అశ్విని దత్. కాగా ప్రస్తుతం ఈ చిత్ర టిక్కెట్ రేట్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అసలు విషయానికి వస్తే సినిమా సెలబ్రిటీస్ ఎవ్వరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముందు టిడిపికి తమ సపోర్ట్ వ్యక్తం చేయలేదు. కేవలం కొంతమంది మాత్రమే ముందుకు వచ్చి పోస్టులు వేశారు. అందులో మొదటిగా నిలిచింది అశ్వినీ దత్. అశ్వినీ దత్ ఎప్పటినుంచో టిడిపి వాది. ఆయనకి చంద్రబాబు నాయుడు అంటే ఎంతో అభిమానం. అందుకే అశ్విని దత్ ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేస్తూ వీడియో కూడా పెట్టారు. అయితే ఈ వీడియో పై స్పందిస్తూ అప్పుడు ఎంతోమంది వైసీపీ వాదులు.. అశ్విని దత్ కి వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టారు. 

ఈసారి వచ్చేది కూడా వైసీపీ ప్రభుత్వమే అని.. తమ ప్రభుత్వం వస్తే కల్కి సినిమా విడుదలను ఆపేస్తామని బెదిరించసాగాడు. అయితే ఈ నిర్మాత ఏమాత్రం భయపడలేదు. కానీ ఎలక్షన్స్ హడావిడి వల్ల మే 9న విడుదల చేయవలసిన ఈ సినిమాని జూన్ 27 కి పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. మరో పక్క టీడీపీ ఘనవిజయం సాధించింది. దీంతో సినిమా వాళ్ళల్లో ఈ విజయం పై ముందుగా  సంతోషపడే వ్యక్తి అశ్వినీ దత్ అని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్.

ముఖ్యంగా సినిమా టికెట్స్ రేట్స్ విషయంలో జగన్ కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో టికెట్ హైక్ ఇవ్వడానికి నిరాకరించారు జగన్. అందులోనూ కొన్ని సినిమాలకైతే బెనిఫిట్ షోస్, టికెట్ ధరల పెంపు క్యాన్సిల్ చేసేసారు. కానీ సినిమా వారి విషయంలో చంద్రబాబు నాయుడు అలా ప్రవర్తించరు అనేది ఎంతో మందికి ఉన్న నమ్మకం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తరువాత మొదట రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత అశ్విని దట్ చంద్రబాబు నాయుడుకి ఆప్తుడు. వీటన్నిటిని బట్టి చూస్తే కల్కి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది అంటున్నారు అందరూ. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కల్కి సినిమా టికెట్ రేట్స్ భారీగా పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ప్రకారం ఈ సినిమా టికెట్లు తప్పకుండా ఆకాశాన్ని అంటుటయేమో ఏమో అనేది కూడా ఎంతోమంది అనుమానం. మరోపక్క ఈ సినిమాకి నిజంగానే టికెట్ ధరలు కానీ పెంచితే.. ప్రభాస్ ముందు సినిమాల రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని అంటున్నారు ప్రభాస్ అభిమానులు.

మొత్తం పైన ఈ సినిమా విషయంలో ఏమి జరుగుతుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

Read more:Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News