Mahesh Babu Comments at Sarkaru Vaari Paata Movie Pre Release Event: టాలీవుడ్ 'సూపర్ స్టార్' మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఫ్యామిలీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఎస్‌వీపీ సినిమా మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఎస్‌వీపీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డైరెక్టర్లు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి.. హీరో సుధీర్ బాబు, నటుడు సముద్రఖని తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో మహేశ్ బాబు మాట్లాడుతూ... 'ఇలాంటి వేడుక చేసుకుని రెండేళ్లు దాటింది. అభిమానులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కరోనా కారణంగా చాలా జరిగిపోయాయి. నాకు బాగా దగ్గరైనవాళ్లు దూరమయ్యారు. ఏది జరిగినా.. ప్రేక్షకుల అభిమానం మాత్రం మారలేదు. ఇది చాలు ధైర్యంగా ముందుకు వెళ్లడానికి. మీకు నచ్చే సినిమాలు చేయడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా' అని అన్నారు.
'ఎస్‌వీపీ సినిమాలో దర్శకుడు పరశురామ్ నా పాత్రని చాలా బాగా డిజైన్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో నటించినప్పుడు నాకు పోకిరి సినిమా రోజులు గుర్తుకొచ్చాయి. హీరో, హీరోయిన్ మధ్య ట్రాక్ బాగా వచ్చింది. ఆ సన్నివేశాలు ప్రేక్షకులు మళ్లీమళ్లీ థియేటర్‌కి వచ్చేలా చేస్తాయి. కీర్తి సురేష్ నటన అందరిని ఆశ్చర్య పరుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాటలు, నేపథ్య సంగీతం బాగా కొట్టాడు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఇరగదీశారు. ఛాయాగ్రాహకుడు మధి, డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్, కళా దర్శకుడు ప్రకాశ్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్, గీత రచయిత అనంత శ్రీరామ్.. ఇలా ప్రతిఒక్కరు సినిమా కోసం బాగా కష్టపడ్డారు' అని సూపర్ స్టార్ తెలిపారు.
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ... 'ఎస్‌వీపీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఆహ్వానపరిచిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ పాత్ర అయినా చేయగరు. మహేష్ సినిమా విడుదలైతే క్లాస్ మాస్, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులూ థియేటర్‌కు వస్తారు. ఈ సినిమాలో చిన్నప్పటి మహేష్‌గా మా అబ్బాయి దర్శన్ కనిపిస్తాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా' అని చెప్పుకొచ్చాడు.
Also Read: Mother's Day 2022: మదర్స్ డే స్పెషల్.. అమ్మకు పంపాల్సిన బెస్ట్ మెసేజ్, కోట్‌లు ఇవే!
Also Read: Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు.. ఏపీకి తుపాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook