Rashmika: డిజాస్టర్లు కొడుతున్నా వదలడం లేదు.. వరుస ఆఫర్లతో రష్మిక సందడి

Bollywood Offers to Rashmika: రష్మిక మందన్న నటించిన రెండు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయకపోయినా ఆమెను తమ సినిమాల్లో నటింప చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

Written by - Chaganti Bhargav | Last Updated : May 12, 2023, 05:33 PM IST
Rashmika: డిజాస్టర్లు కొడుతున్నా వదలడం లేదు.. వరుస ఆఫర్లతో రష్మిక సందడి

Back to Back Bollywood Offers to Rashmika: రష్మిక మందన్న తెలుగులో చలో అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఆమె అప్పటికి కన్నడలో చేసింది కిరాక్ పార్టీ అనే ఒకే ఒక్క సినిమా అయినా సరే ఆ సినిమాలో ఆమె పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి తెలుగులో అప్పటి దర్శకుడు వెంకీ కుడుముల నాగశౌర్య పక్కన అల్లరి పిల్ల క్యారెక్టర్ కోసం ఆమెను ఏరుకోరి తీసుకొచ్చారు.

మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో ఆమె చేసిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం మాత్రమే కాదు 100 కోట్లు కలెక్షన్లు కూడా కొల్లగొట్టడంతో ఆమె ఏకంగా వివాహం కూడా క్యాన్సిల్ చేసుకుని పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టింది. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోలతో కూడా నటించిన ఈ భామ ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. రష్మిక మందనకి ఇప్పుడు బాలీవుడ్ అవకాశాలు రావడం మాత్రమే కాదు ఇంతకు ముందే ఆమె చేసిన రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Also Read: Custody Movie Review: 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య హిట్టు కొట్టాడా?

ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయకపోయినా ఆమెను తమ సినిమాల్లో నటింప చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆమె నటించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో పుష్ప సినిమా హీరోయిన్ తమ సినిమాలో కూడా నటించింది అని మార్కెటింగ్ చేసుకునేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రతి నెలలోనూ ఏదో ఒక్క ఆఫర్ అయినా ఆమె తలుపుతడుతోందని అంటున్నారు. ప్రస్తుతానికి ఆమె రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక అలాగే షాహిద్ కపూర్ సరసన ఒక సినిమా విక్కీ కౌశల్ సరసన మరో సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఆఫర్లు ఆమె తలుపు తట్టాయని అయితే ఆమె సినిమా చేయాలా వద్దా అనే విషయం మీద ప్రస్తుతానికి ఆలోచనలో పడిందని అంటున్నారు.

నిజానికి ఆమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సౌత్ ఇండియన్ యాక్టర్స్ లో అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలో కలిగిన ఖాతాగా కూడా రష్మికకి పేరు ఉంది. ఆమె ప్రస్తుతానికి మూడు తెలుగు సినిమాల్లో కూడా భాగమైంది. నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్లో ఒక సినిమా పుష్ప 2 సినిమా అలాగే రెయిన్బో అనే మరో సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటిస్తోంది.
Also Read: Divyabharathi Tollywood Entry: సుడిగాలి సుధీర్ కోసం తమిళ భామ.. ఏకంగా దివ్యభారతిని దింపుతున్నారుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x