Unstoppable: అలా చేస్తేనే ఎక్కడో కాలుతుందంటున్న బాలయ్య, అసలేమైంది

Unstoppable: టాలీవుడ్ సూపర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపెబుల్ నిజంగానే పేరుకు తగ్గట్టుగా ఆగడం లేదు. ఇప్పుడు నెవర్ హ్యావ్ ఐ ఎవర్ గేమ్‌లో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. అలా చేస్తే ఎక్కడో కాలుతుందంటున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 11, 2022, 10:58 AM IST
Unstoppable: అలా చేస్తేనే ఎక్కడో కాలుతుందంటున్న బాలయ్య, అసలేమైంది

Unstoppable: టాలీవుడ్ సూపర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపెబుల్ నిజంగానే పేరుకు తగ్గట్టుగా ఆగడం లేదు. ఇప్పుడు నెవర్ హ్యావ్ ఐ ఎవర్ గేమ్‌లో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. అలా చేస్తే ఎక్కడో కాలుతుందంటున్నారు.

ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో నాన్‌స్టాప్‌గా స్ట్రీమ్ అవుతున్న అన్‌స్టాపెబుల్ కార్యక్రమంలో మరో కొత్త గేమ్ ప్రారంభమైంది. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ప్రోగ్రాం ఇది. ఈసారి ఈ గేమ్ బాలకృష్ణపైనే సాగింది. యాంకర్ వాయిస్‌లో ప్రశ్నలు విన్పిస్తుంటే..బాలకృష్ణ ఐ హ్యావ్ లేదా నెవర్ బోర్డులు చూపించడం ద్వారా సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఇందులో బాలకృష్ణ వ్యక్తిగత విషయాలు చాలానే ఉన్నాయి. ఈ గేమ్‌లో బాలకృష్ణ గెటప్ కూడా ఆసక్తికరంగా భిన్నంగా ఉంది. స్టైలిష్ షర్ట్, ఏవియేటర్స్, క్యాప్ ధరించి ఉన్నాడు. వాలెంటైన్ డే రోజు ప్రసారం కావల్సిన ఈ ప్రోగ్రాం టీజర్ విడుదలైంది. ఇందులో బాలకృష్ణ చాలా ఆసక్తికర విషయాలే వెల్లడించారు. 

తన మనవళ్లు తాతా అని పిలవడం ఇష్టం లేదన్నాడు. బాలా అని పిలవాలట. డ్యాన్స్ కంపోజింగ్ విషయంలో మూమెంట్ వచ్చాక కూడా పదే పదే రిహార్సల్ చేయిస్తుంటే..ఎక్కడో కాలుతుందంటున్నాడు బాలయ్య. స్కూల్, కాలేజ్ క్లాసులు బంక్ కొట్టడం సహజమే కదా అంటున్నాడు. అయితే డుమ్మా కొట్టిన విషయం తండ్రి ఎన్టీఆర్ కు తెలియదట. ఇలా ఆసక్తిగా సాగుతుంది ఈ కార్యక్రమం. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపెబుల్ సీజన్ 1 చివరి ఎపిసోడ్ మహేశ్ బాబుతో ముగిసింది. రెండవ సీజన్ ఇంకా ప్రారంభం కావల్సి ఉంది. అంతవరకూ గ్యాప్ ఫిల్ చేసేందుకు ఈ కొత్త గేమ్ షో నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ప్రోగ్రాం. అన్‌స్టాపెబుల్ కార్యక్రమం మాత్రం బాలయ్య కామెడీ, టైమింగ్, స్పాంటేనిటీతో అద్భుతంగా మనోరంజకంగా ఉంది. 

Also read: Nithya Menen: చక్కనమ్మ చిక్కినా అందమే..నాజుగ్గా మారుతున్న నిత్యా మేనన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News