Bharatheeyudu 2: టికెట్ రేట్ల పెంపు భారతీయుడు 2కు ప్లస్సా.. మైనసా.. !

Bharatheeyudu 2: కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. అపుడెపుడో 28 క్రితం తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం 8 రోజుల పాటు టిక్కెట్ రేట్స్ పెంచుకోడానికి ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. టికెట్ రేట్స్ పెంపు అనేది భారతీయుడు 2కు ప్లస్ అవుతుందా.. మైనస్ గా మారుతుందా ?  

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 11, 2024, 02:35 PM IST
Bharatheeyudu 2: టికెట్ రేట్ల పెంపు భారతీయుడు 2కు ప్లస్సా.. మైనసా.. !

Bharatheeyudu 2: కమల్ హాసన్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఆయన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి తెలుగు ఆడియన్స్ చొక్కాలు చించుకున్న సందర్బాలున్నాయి. ఇదంత గతం.. ఇపుడు కమల్ హాసన్ కు ఒకప్పటిలా తెలుగులో స్టార్ ఇమేజ్ లేదు. దశావతారం సినిమా వరకు తెలుగులో కమల్ హాసన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉండేది.  తర్వాత రాను రాను ఇక్కడి మార్కెట్ దారుణంగా పడిపోయింది. కమల్ హాసన్ లాస్ట్ మూవీ ‘విక్రమ్’ తో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ సినిమా కూడా ఒకప్పటి కమల్ హాసన్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్. ఆ సినిమాకు లోకేష్ కనగరాజ్ ఫ్యాక్టర్ సినిమాకు బాగా ఉపయోగపడింది. పైగా కమల్ హాసన్.. తన ఏజ్ తగ్గ పాత్రలో నటించి మెప్పించారు.

తాజాగా ‘భారతీయుడు 2’ సినిమాతో పలకరిస్తున్నాడు. ఇది 28 ఏళ్ల క్రితం శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు. ఇప్పటి యూత్ ఈ సినిమా వచ్చినపుడు పుట్టికపోయి ఉండొచ్చు. ఏదో యూట్యూబ్ లేదా టీవీ ఛానెల్ లో ఆ సినిమా చూస్తే కానీ ‘భారతీయుడు’ సినిమా గురించి పెద్దగా తెలియదు.

అప్పట్లో భారతీయుడు .. లంచగొండి తనంపై శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం. లంచం తీసుకున్న కారణంగా కన్న కొడుకు ను సైతం చంపే .. నిజాయితీ గల భారతీయుడు స్టోరీ. స్వతహాగా తమిళ హీరో అయిన కమల్ హాసన్ కు ఆ రాష్ట్రంలో ఈ సినిమాపై మంచి బజ్ ఉండొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వస్తుందన్న సంగతి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకున్నట్టు కనపడటం లేదు. పైగా ఈ సినిమాపై తెలుగులో పెద్దగా బజ్ లేదు. పైగా దర్శకుడిగా శంకర్ ట్రాక్ రికార్డు కూడా ఏమంత బాగాలేదు. ఇలంటి సమయంలో పెద్ద బడ్జెట్ మూవీ అని ఈ సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడం విడ్డూరంగా ఉందని అందరు చెప్పుకుంటున్నారు. మాములుగా మన దగ్గర సినిమా టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయని ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడాలంటే  భయపడుతున్నారు.  ఏదో ‘కల్కి’ లాంటి సినిమాకు ఎలాగో అలా టికెట్ రేట్స్ పెంచినా.. పాజిటివ్ టాక్.. అద్భుతమైన గ్రాఫిక్స్ ఉన్న ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తేనే మజా వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఎలాగో అలా థియేటర్స్ లో చూడటానికి ఫ్యామిలీస్ వెనకాడలేదు.

ఆ సినిమా వచ్చి రెండు వారాలు మాత్రమే అయింది. దాదాపు ఒక్కో కుటుంబం దాదాపు రూ. 2 వేల వరకు కల్కి కోసం చేతి చమురు ఒదిలించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయుడు 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. అలాంటి డబ్బింగ్ సినిమాకు ఎనిమిది రోజుల పాటు టికెట్ రేట్స్ రూ. 75 పెంచుకోవడానికి అనుమతులు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. అంతేకాదు 5 షోకు కూడా ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఏది ఏమైనా ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే కానీ ఈ సినిమా గట్టెక్కదు. ఏది ఏమైనా శంకర్, కమల్ హాసన్ లు చేసిన ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో వెయిట్ అండ్ సీ.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News