Bheemla Nayak Pre Release: భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముహుర్తం ఖరారు!

Bheemla Nayak Pre Release: అనూహ్యంగా వాయిదా పడిన భీమ్లా నాయక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ పై స్పష్టత వచ్చింది. ఈ వేడుకను బుధవారం (ఫిబ్రవరి 23) హైదరాబాద్ లో నిర్వహించేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయమై టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 01:24 PM IST
    • పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్
    • భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణపై క్లారిటీ!
    • బుధవారం (ఫిబ్రవరి 23) వేడుకను నిర్వహించే అవకాశం
Bheemla Nayak Pre Release: భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముహుర్తం ఖరారు!

Bheemla Nayak Pre Release: సోషల్ మీడియాలో ప్రస్తుతం 'భీమ్లా నాయక్' మూవీ ట్రైలర్ ట్రెండ్ నడుస్తోంది. అతితక్కువ సమయంలో ఎక్కువ లైక్స్ పొందిన ట్రైలర్ గా ఇది నిలిచింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించి ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 25) సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. సోమవారం (ఫిబ్రవరి 21) చిత్ర ప్రీ - రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాల్సి ఉంది. 

అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణానికి సంతాపంగా ఆ వేడుకను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ఈవెంట్ ను బుధవారం (ఫిబ్రవరి 23) నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే విషయమై టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. 

'భీమ్లా నాయక్' సినిమా ప్రీ - రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారక రామారావు రావాల్సి ఉంది. వీరితో పాటు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వేడుకలో పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రీ - రిలీజ్ ఈవెంట్ తర్వాత వీరే అతిథులుగా వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై నిర్మాణసంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికేట్ దక్కించుకుంది. 

మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఇందులో పవర్​స్టార్​ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించగా.. వీరి సరసన ​నిత్యామీనన్, సంయుక్తా మీనన్​లు హీరోయిన్లుగా నటించారు. సాగర్​ కే చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.  

Also Read: Bheemla Nayak Trailer: పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. మరో ఐదు గంటల్లో భీమ్లానాయక్ ట్రైలర్!

Also Read: New Movie Releases: భీమ్లానాయక్, వాలిమై.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో రిలీజ్ కానున్న చిత్రాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News