Case Filed On Mohan Babu: నటుడు మోహన్‌బాబుకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన పై బీఎన్‌ఎస్ సెక్షన్ 118 కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే రాచకొండ పోలీసులు విచారణకు హాజరు కావాలని ఈరోజు ఉదయం 10:30 నిమిషాలకు మోహన్‌బాబుతోపాటు ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్‌లను కూడా హాజరు కావాలని సీపీ ఆదేశించారు. మంచువారింట మంటలు రాజుకుంటున్నాయి. కుటుంబ కలహాలు కాస్త రోడ్డెక్కడంతో పరిస్థితులు చేజారిపోయాయి. నిన్న కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధిపై కూడా మోహనబాబు చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో సదరు మీడియా ప్రతినిధి తలకు ఫ్రాక్చర్ అయినట్లు చెబుతున్నారు. కన్ను, చెవుకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. మోహన్‌బాబు సదరు మీడియా ప్రతినిధిపై దాడి చేసిన నెట్టింట బాగా వైరల్ అయింది. ఒకానొక సమయంలో అసలు మోహనబాబు మానసిక పరిస్థితి ఏమైంది? ఎలా ఉంది? అని అంత అనుకుంటున్నారు. ఇలాంటి ఓ పెద్ద స్థాయి వ్యక్తి విచక్షణ కోల్పోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఆస్తి వివాదంలో మోహన్ బాబు మంచు మనోజ్‌కు వివాదాలు తలెత్తాయి. దీంతో మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి నుంచి మరింత వివాదం రాజుకుంది. రెండు రాష్ట్రాల సీఎంలు, పవన్‌కు సైతం మనోజ్ న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశారు. అయితే, మంచు విష్ణు బిజినెస్ భాగస్వామి దాడి చేయడంతో గాయాలు కూడా అయ్యాయని మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ అస్సలు తగ్గేదేలే.. 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రతిరోజూ 2 జీబీ మరిన్ని బెనిఫిట్స్..
అయితే, నిన్న శంషాబాద్ జల్‌పల్లి ఫామ్‌హౌజ్‌లోకి మనోజ్ వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ, గేట్లు మూసివేసి లోపలికి రానివ్వకపోవడంతో గేట్లు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లాడు. ఇక ఈ వీడియోలో నా కూతురిని నాకు ఇవ్వండి అని ఏడ్చిన విజువల్స్ కూడా ఉన్నాయి. కానీ, మోహన్ బాబు అతని బౌన్సర్లు బయటకు మనోజ్‌ను పంపించారు. ఈ తోపులాటలో మనోజ్ చొక్క చిరిగింది. ఆ సమయంలోనే కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు విచక్షణ కోల్పోయి మైక్ లాక్కొని అతనిపై దాడి చేశాడు. ఈ విజువల్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: అనసూయ అందాల ఆరబోత.. ఈ ఫోటో చూస్తే గుండె జారుద్ది జాగ్రత్త..!
గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఈ మంచు వివాదంపై పోలీసులు కూడా సీరియస్ తీసుకున్నారు. తాజాగా మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌ల వద్ద ఉన్న పిస్టల్స్ కూడా సరెండర్ చేసుకున్నారు. ఇక బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశించారు. ఈరోజు ఉదయం సీపీ ఆఫీసులో ముగ్గురూ హాజరు కావాలని ఆదేశించారు. ప్రస్తుతం మోహన్‌బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న జరిగిన తోపులాటలో మోహన్ బాబు తలకు కూడా గాయం అయిందని అంటున్నారు. సదరు మీడియా ప్రతినిధికి కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.