Bigg Boss 4 contestant Akhil: అఖిల్‌కి విలన్‌గా ఛాన్స్ ?

బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌ తనకు సినిమాల్లో విలన్‌ పాత్రల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టాడు. అయితే, తాజాగా వినిపిస్తున్న ఫిలింనగర్ టాక్ ప్రకారం అఖిల్ కోరిక ఇప్పుడప్పుడే నెరవేరకపోయినా.. ఆ కోరికను నెరవేర్చుకునే మార్గం చూపే అవకాశం అఖిల్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది.

Last Updated : Jan 5, 2021, 07:23 PM IST
  • బిగ్ బాస్ కంటెస్టంట్ అఖిల్‌కి విలన్‌గా అవకాశం.
  • గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో అఖిల్‌కి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఆఫర్ చేసినట్టు టాక్.
  • అఖిల్ కోరిక నెరవెర్చుకునేందుకు సీటిమార్ చిత్రం ఉపయోగపడుతుందా ?
Bigg Boss 4 contestant Akhil: అఖిల్‌కి విలన్‌గా ఛాన్స్ ?

బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌ తనకు సినిమాల్లో విలన్‌ పాత్రల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టాడు. అయితే, తాజాగా వినిపిస్తున్న ఫిలింనగర్ టాక్ ప్రకారం అఖిల్ కోరిక ఇప్పుడప్పుడే నెరవేరకపోయినా.. ఆ కోరికను నెరవేర్చుకునే మార్గం చూపే అవకాశం అఖిల్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది. అవును.. అఖిల్‌కి ఓ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించే అవకాశం దక్కినట్టు టాక్ వినిపిస్తోంది. 

ఫిలింనగర్ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. సంపత్ నంది డైరెక్షన్‌లో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న సీటిమార్ చిత్రంలో అఖిల్‌కి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించే అవకాశం వచ్చినట్టు సమాచారం. సీటిమార్ మూవీ సెకండ్ హాఫ్‌లో అఖిల్ ఎంట్రీ ఉంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అఖిల్‌కి సీటిమార్ మూవీలో ( Seetimaarr ) ఛాన్స్ వచ్చినట్టే అయితే.. అది అతడికి మంచి బ్రేక్‌ని ఇవ్వడం ఖాయం అంటున్నారు అఖిల్ ఫ్యాన్స్.  

Also read : టాలీవుడ్‌పై Anchor Anasuya సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్‌లో విజేత అయిన అభిజీత్‌తో చివరి వరకు పోటీపడిన అఖిల్ ( Bigg Boss contestant Akhil ).. చివర్లో రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అభిజీత్ విన్నర్, అఖిల్ రన్నరప్ కాగా యాంకర్ అరియానా గ్లోరి, దేత్తడి హారిక, సయ్యద్ సోహెల్ రియాన్ ( Sohel ) చివరి ఐదు ఫైనలిస్టులలో ఒకరిగా బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేశారు.

Also read : మరో పెళ్లి చేసుకున్న రాఘవేంద్ర రావు మాజీ కోడలు Kanika Dhillon

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News