Bigg Boss Telugu 4 New Timings: బిగ్‌బాస్ 4 టైమింగ్స్ మార్పు.. పెద్దన్నను వెనక్కి నెట్టిన సీరియల్!

Bigg Boss 4 Telugu New Timings | బిగ్‌బాస్ తెలుగు 4 ప్రేక్షకులకు ఓ బిగ్ అప్‌డేట్ తెలియాల్సి ఉంది. రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యేది. డిసెంబర్ 7 నుంచి బిగ్ బాస్ 4 సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం వేళలో మార్పులు చోటుచేసుకున్నాయి.

Last Updated : Dec 1, 2020, 06:42 PM IST
Bigg Boss Telugu 4 New Timings: బిగ్‌బాస్ 4 టైమింగ్స్ మార్పు.. పెద్దన్నను వెనక్కి నెట్టిన సీరియల్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 దాదాపుగా చివరిదశకు వచ్చేసింది. అయితే ఈ సమయంలో బిగ్‌బాస్ తెలుగు 4 ప్రేక్షకులకు ఓ బిగ్ అప్‌డేట్ తెలియాల్సి ఉంది. ఇప్పటివరకూ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యేది. అయితే డిసెంబర్ 7 నుంచి బిగ్ బాస్ 4 సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటల నుంచి ప్రసారం కానుంది. 

ఇప్పటివరకూ రాత్రి 7 గంటల సమయంలో వదినమ్మ సీరియల్ ప్రసారమయ్యేది. అయితే కొత్త సీరియల్ గుప్పెడంత మనసు కు వదినమ్మ సీరియల్ టైమ్ కేటాయించారు. దీంతో వదినమ్మ సీరియల్ అతిపెద్ద రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 షోను వెనక్కి నెట్టింది. సోమ నుంచి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఇకనుంచి వదినమ్మ సీరియల్ ప్రసారం చేయనున్నారు. దీంతో బిగ్‌బాస్ 4 అరగంట సమయం (Bigg Boss Telugu 4 New Timings) వెనుకకు జరగాల్సి వచ్చింది.

 

కాగా, శని, ఆదివారాల్లో బిగ్‌బాస్ 4 హోస్ట్ కింగ్ నాగార్జున వచ్చే ఎపిసోడ్స్ మాత్రం యథావిధిగా పాత సమయంలోనే ప్రసారం కానున్నాయి. శని, ఆదివారాల్లో బిగ్‌బాస్ 4 రాత్రి 9 గంటలకు యథావిధిగా ప్రసారం అవుతుంది. మరికొన్ని రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు 4 షో పూర్తి కానుండటం, కొత్త షోను ప్రమోట్ చేయాలనే యోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News